కే ట్యాక్స్ ఎఫెక్ట్: నరసరావుపేట కోర్టుకు కోడెల కూతురు, వసూళ్ల కేసులో లొంగిపోయిన విజయలక్ష్మీ
కే ట్యాక్స్ పేరుతో బెదిరించి, వసూళ్లకు పాల్పడిన మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ కూతురు విజయలక్ష్మీ నరసారావుపేట కోర్టులో లొంగిపోయారు. బెదిరింపులు, అక్రమ వసూళ్ల కేసుకు సంబంధించి విజయలక్ష్మీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెదిరింపులకు సంబంధించి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదవడంతో.. విజయలక్ష్మీ కోర్టులో లొంగిపోయారు.

శృతిమించిన ఆగడాలు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ విజయం సాధించారు. స్పీకర్ పదవీ చేపట్టాక.. అతని కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ రెచ్చిపోయారు. ఎవరినీ వదలకుండా అందినకాడికి దోచుకున్నారు. స్పీకర్ కుమారుడు, కూతురు కదా అని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు. కానీ సాధారణ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఒక్కొక్కరు బయటకొచ్చారు. కే ట్యాక్స్ పేరుతో సాగించిన అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఒక్కొక్కరు వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.

ఇలా వెలుగులోకి..
కోడెల కూతురు విజయలక్ష్మీ మోసం చేసిందని బాధితురాలు పద్మావతి పోలీసులను ఆశ్రయించారు. గుంటూరులో ఎకరం భూమి తనకు ఉందని ఆమె తెలిపారు. ఆ భూమిపై కన్నుపడ్డ విజయలక్ష్మీ నకిలీ రికార్డులతో బెదిరింపులకు దిగిందని వాపోయారు. భూమి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో .. రూ.15 లక్షలు ఇవ్వాలని కోరితే భయపడి ఇచ్చామని తెలిపారు. కానీ తర్వాత మరో .5 లక్షలు ఇవ్వాలని వేధింపులకు దిగుతుందని నిట్టూర్చారు. తన వద్ద అంత డబ్బులేదని చెప్పిన వినకుండా .. బెదిరిస్తున్నారని ఆరోపించారు. వేధింపులు తాళలేక పోలీసులను పద్మావతి ఆశ్రయించడంతో కోడెల కూతురు అవినీతి పుట్ట కదిలింది. తర్వాత ఒక్కొక్కరు ఫిర్యాదు చేశారు.

అడ్డు అదుపు లేదు..
సత్తెనపల్లి రాజధాని సమీప ప్రాంతం కావడంతో .. కోడెల కూతురు, కుమారుడి ఆగడాలు మితిమీరిపోయాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, కాంట్రాక్టు పనులు అప్పజెప్పుతామని, అంతేందుకు కేబుల్ వ్యవహారాల్లో కూడా దూరి అందినకాడికి దోచుకున్నారు. వరి పంట కోత తర్వాత గడ్డి స్కాం చేసి కోడెలకు మచ్చ తీసుకొచ్చారు. తన కూతురు, కుమారుడు ఇన్ని చేస్తున్నా మిన్నకుండిపోవడమే కోడెల చేసిన తప్పిదమైపోయింది. అదే అతని పేరు మసకబారిపోయేట్టు చేసింది.

కేసులు, కోర్టులతో ఉక్కిరి బిక్కిరి
టీడీపీ హయాంలో చేసిన అవినీతి పుట్ట ఒక్కొక్కటి కదులుతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కోడెల కుమారుడు శివరామకృష్ణ కూడా పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. రేపో, మాపో అరెస్టవడం కంటే కోర్టులో లొంగిపోవడమే మిన్న అనుకొని గురువారం విజయలక్ష్మీ నరసారావుపేట కోర్టులో లొంగిపోయారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications