తాకట్టు పెట్టిన గోల్డ్‌ని అమ్ముకున్న బ్యాంకు ఉద్యోగులు
హైదరాబాద్: ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటే, బ్యాంకు ఉద్యోగులు అక్రమంగా ఆ బంగారాన్ని తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కడపలో జరిగింది.
కడపలోని కరూర్ వైశ్యా బ్యాంకు తమ బంగారాన్ని అమ్ముకుందని ఆరోపిస్తూ ఖాతాదారులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకున్న కస్టమర్స్ బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications