పటాస్ వివాదం: చిక్కుల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్
హైదరాబాద్: పటాస్ విజయంతో సంతోషంతో ఉన్న హీరో కళ్యాణ్ రామ్ చిక్కుల్లో పడనున్నారు. వివరాల్లోకి వెళితే, జాతీయ చిహ్నాన్ని కించపరిచారంటూ హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కానుంది.

జాతీయ చిహ్నాన్ని కించపరిచారంటూ శ్రీధర్ అనే న్యాయ శాస్త్ర విద్యార్ధి బంజారా హిల్స్ పోలీసులకు హీరో కళ్యాణ్ రామ్‌పై ఫిర్యాదు చేశాడు. కళ్యాణ్ రామ్‌కు ఈ విషయమై లీగల్ నోటీసు పంపినా స్పందించలేదని తెలిపారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో పటాస్ సినిమాని రూపొందించారు. కాబట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యలయంపైనా కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదుపై బంజారా హిల్స్ పోలీసులు స్పందించారు. కళ్యాణ్ రామ్‌పై కేసు నమోదు చేసే విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications