వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్టర్‌ప్లాన్‌ బీరువాలో దాచారా?...అమరావతి బాండ్ల సొమ్ముకు లెక్కలు చెప్పండి!:కన్నా లక్ష్మీనారాయణ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శల వర్షం కురిపించారు. రాజధాని​ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో టిడిపి ప్రభుత్వం ఒక్క పనికి కూడా శంకుస్థాపన చేయలేదని ధ్వజమెత్తారు.

భారత 72వ స్వాతంత్ర్య దినం సందర్భంగా బుధవారం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు...మాస్టర్‌ ప్లాన్‌ బీరువాలో దాచారా అని ప్రశ్నించారు.

రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్ల జారీ ద్వారా సేకరించిన రూ.2000 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన బాబు ముమ్మాటికీ ఆంధ్రా ద్రోహి, పచ్చి అవకాశవాది అని కన్నా మండిపడ్డారు. రెండుకళ్ల సిద్ధాంతంలో రాటుదేలిన బాబు చివరకి పొత్తుల్లో కూడా అదే ఫాలో అయ్యారని ఎద్దేవా చేశారు.

Kanna Laxminarayana Fires On Chandrababu Naidu Over Amaravati Construction

దేశంలో గ్రామీణప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి కారణం ప్రధాని నరేంద్రమోదీ చలవేనని కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని తేల్చిచెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించడం పట్ల కన్నా ఆనందం వ్యక్తం చేశారు.

ఈ పథకం పేదలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య బీమా కింద తొలి విడతగా 10 కోట్ల మందికి ఉచిత ఆరోగ్య సేవలు అందనున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే. ఈ పథకాన్ని మోదీకేర్‌గా అభివర్ణించారు.

ఇదిలా వుండగా సిఎం చంద్రబాబుపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మట్లాడుతూ సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు లేదన్నారు.మంగళవారం గంట వ్యవధిలోనే అమరావతి బాండ్ల రూపంలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే చంద్రబాబు ఇమేజే కారణమని అన్నారు. కన్నా నెత్తిన రూపాయి పెట్టినా...అర్ధ రూపాయికి కూడా ఎవరూ కొనరని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు దయతో ఏపీలో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిచిందని, 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి మిగిలేది సున్నానే అని బుద్దా వెంకన్న తేల్చిచెప్పారు. బీజేపీ, వైసీపీ నేతలు రాష్ట్ర ద్రోహులు గా అభివర్ణించారు.

English summary
AP BJP Chief Kanna Lakshmi Narayana once again criticized Chief Minister Chandrababu Naidu. Kanna Lakshminarayana unveiled national flag in the state BJP office on Wednesday during the 72nd Independence Day of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X