వైసీసీకి కొత్త వ్యూహకర్త గా కపిల్ సాహు - నాడు విజయ్ గెలుపు వెనుక, నేడు జగన్ కోసం..!?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. 2029 ఎన్నికల కోసం ఇప్పటికే కూటమి - వైసీపీ సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో.. ఇప్పటికే కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. జగన్ ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతో కనిపిస్తున్నారు. ఇందు కోసం కొత్త వ్యూహకర్త కోసం మంత్రాంగం ప్రారంభించారు. తమిళనాడులో విజయ్ ను గెలిపించిన వ్యూహకర్త ఇప్పుడు వైసీపీ కోసం రంగం లోకి దిగటం దాదాపు ఖాయమైంది.

ఏపీలో వచ్చే ఎన్నికల కోసం కూటమి- వైసీపీ తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. అందులో భాగంగా కూటమి నేతలు జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కూటమి పైనా జగన్ పోరాటం తీవ్రతరం చేసారు. జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కొంత కాలంగా ప్రత్యేకంగా ఒక టీం పని చేస్తోంది. అదే విధంగా వైసీపీకి 2019 లో ప్రశాంత్ కిశోర్, 2024 ఎన్నికల్లో రుషిరాజ్ సింగ్ టీంలు తెర వెనుక సేవలు అందించాయి.

కూటమి vs వైసీపీ, అసలు పరీక్ష- 2029కి ముందే ఫలితం.. సెమీ ఫైనల్..!!
కూటమి vs వైసీపీ, అసలు పరీక్ష- 2029కి ముందే ఫలితం.. సెమీ ఫైనల్..!!
Kapil Sahu Likely to Join YSRCP Strategy Team Ahead of 2029 Elections as latest discussions

2024 లో జగన్ ఓటమి తరువాత ఆ టీంతో ఒప్పందం రద్దయింది. ఇక, వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త రాజకీయ వ్యూహకర్త కోసం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ వ్యూహకర్తలతో చర్చలు చేసినా.. వారి నియామం పైన తుది నిర్ణయం తీసుకోలేదు. తాజాగా బెంగళూరు కేంద్రంగా తమిళనాడులో విజయ్ గెలుపులో అన్నా తానై వ్యవహరించిన కపిల్ సాహు టీంతో కీలక మంత్రాంగం చేసినట్లు పార్టీ నేతల సమాచారం.

తమిళనాడు టీవీకే చీఫ్ విజయ్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన మాస్టర్ మైండ్ కపిల్ సాహు సేవలను వైసీపీ వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందు కోసం విజయ్- జగన్ ఉమ్మడి మిత్రులు తెర మీదకు వచ్చారు. కపిల్ సాహు ను జగన్ కోసం పని చేసేందుకు ప్రాధమికంగా చర్చలు చేసినట్లు సమాచారం. దీంతో, రెండో విడతలో భాగంగా ఈ మేరకు ప్రతిపాదనల పైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తొలుత ప్రశాంత్ కిశోర్ టీంతో కలిసి కపిల్ సాహు పని చేసారు. తాజాగా తమిళ నాడు ఎన్నికలకు రెండేళ్ల ముందుగా రంగంలోకి దిగిన కపిల్ సాహు ప్రత్యేకంగా డిజిటల్ ప్రచారం, ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాల నిర్వహణ ద్వారా విజయ్ ను అన్ని వర్గాలకు దగ్గర చేసారు.

 'డీలిమిటేషన్' పై జగన్ అనూహ్య నిర్ణయం - ఢిల్లీ కేంద్రంగా, కొత్త లెక్కలు..!!
'డీలిమిటేషన్' పై జగన్ అనూహ్య నిర్ణయం - ఢిల్లీ కేంద్రంగా, కొత్త లెక్కలు..!!

ప్రచారంలోనూ కొత్త వ్యూహాలను అమలు చేసారు. విజయ్ గెలుపులో కీలకంగా పని చేసిన కపిల్ సాహు సేవలను విజయ్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ కోసం వ్యూహకర్త గా కపిల్ సాహు సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా తొలి అడుగు వేసినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే కపిల్ సాహు వైసీపీకి రాజకీయ వ్యూహకర్త గా రంగంలోకి దిగటం దాదాపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+