సిద్ధరామయ్య ఆందోళన- హుటాహుటిన చంద్రబాబుకు లేఖ: అలాంటి పరిస్థితి రాకూడదు

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. వార్షికోత్సవ వేడుకలను జరుపుకొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.

గత ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. తొలి వార్షికోత్సవాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

Karnataka CM Siddaramaiah writes his Andhra counterpart Chandrababu

ఈ పరిస్థితుల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. చంద్రబాబుకు లేఖ రాశారు. రైతు సమస్యలు, వాళ్లు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. అధికార యంత్రాంగం తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల తమ రాష్ట్రానికి చెందిన మామిడి రైతులు ఇక్కట్లపాలవుతున్నారని అన్నారు.

కర్ణాటకలో పండించిన తోతాపురి మామిడిని చిత్తూరు జిల్లాలో విక్రయించడం ఆనవాయితీగా వస్తోందని సిద్ధరామయ్య గుర్తు చేశారు. తమ రాష్ట్రం నుంచి వచ్చే ఈ రకం మామిడిపండ్లను నిషేధిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని, అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీసులు, అటవీ, మార్కెటింగ్ శాఖ అధికారులతో తనిఖీలు నిర్వహిస్తోన్నారని సిద్ధరామయ్య వివరించారు.

ఇది కర్ణాటక మామిడి రైతులకు ఇబ్బందికరంగా పరిణమించిందని సిద్ధరామయ్య చెప్పారు. తమ రాష్ట్ర రైతులు చిత్తూరు జిల్లాలోని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ కేంద్రాలకు ఎప్పటి నుంచో మామిడిని సరఫరా చేస్తోన్నారని, తాజాగా విధించిన నిషేధం వల్ల వాళ్లు కష్టాలపాలవుతున్నారని అన్నారు.

ఈ పరిణామాలు.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందని సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిషేధం- రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సహకారానికి, సమాఖ్య వ్యవస్థకూ గొడ్డలిపెట్టుగా మారవచ్చని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని గుర్తుచేశారు. తమను సంప్రదించకుండానే నిషేధం విధించారని చెప్పారు.

మామడి రవాణాపై విధించిన నిషేధానికి ప్రతిగా.. ఏపీ నుంచి కర్ణాటకకు తరలివచ్చే కూరగాయలు, ఇతర వ్యవసాయోత్పత్తులపైనా నిషేధం విధించాలని స్టేక్ హోల్డర్లు ఇప్పటికే డిమాండ్ చేస్తోన్నారనీ సిద్ధరామయ్య పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటోన్నట్లు తెలిపారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+