మాజీ ప్రధాని మోదీతో చంద్రబాబు గిల్లికజ్జాలు

Chandrababu Naidu: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. టీడీపీ సాధించిన ఈ తిరుగులేని విజయం జాతీయస్థాయిలో అందరినీ ఆకర్షించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా టీడీపీ మద్దతు సైతం అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో అటు బీజేపీ- ఎన్డీఏ కూటమి, ఇటు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా.. చంద్రబాబు మద్దతును సాధించడానికి తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టాయి కూడా. ఈ క్రమంలో తమకు మద్దతు ఇస్తే- చంద్రబాబుకు కీలకమైన పదవులను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఆ రెండు కూటములు.

Kerala Congress x handle post a old pic of Chandrababu Naidu who met Akhilesh Yadav

చంద్రబాబు మాత్రం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎన్డీఏకి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఎన్డీఏ పొత్తు ఉన్నందున ఆ కూటమిలోనే కొనసాగుతానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికి ముందు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే.

ఢిల్లీ చేరుకున్న అనంతరం చంద్రబాబు తీరిక లేకుండా గడుపుతున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు. అక్కడ విశ్రాంతి తీసుకున్న అనంతరం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న మాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో- కాంగ్రెస్ పార్టీ కేరళ రాష్ట్ర శాఖ అధికారిక ఎక్స్ అకౌంట్ ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్ చేసింది. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా భాగస్వామ్య పక్షం సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో చంద్రబాబు సమావేశమైన పాత ఫొటో అది. దాన్ని తవ్వి తీసి తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Don't panic Modiji, it's an old pic (ఆందోళన పడొద్దు మోదీ జీ. అది పాత ఫొటో) అంటూ క్యాప్షన్‌ను జత చేసింది. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను కలిశాడనే అర్థం వచ్చేలా కామెంట్స్ పెట్టింది. అది పాత ఫొటో అని గుర్తు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+