AP Cabinet Meet:స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రతిపాదనలు...ఆమోదించే ఛాన్స్
అమరావతి: సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. సీఎం జగన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పంచాయతీ రాజ్ చట్టంలో కీలక సవరణలు చేసే అంశంపై కేబినెట్‌లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
స్థానిక ఎన్నికల ప్రచారంలో మద్యం నగదు పంచుతూ పట్టుబడి నేరం రుజువైతే అభ్యర్థిపై అనర్హత వేటు వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంను కూడా కుదించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలన్నిటికీ ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక ఒకటి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్కూలు బ్యాగ్ ఇవ్వాలని ప్రతిపాదన ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో పాటు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇచ్చే అంశం కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రానుంది.

ఎర్ర చందనం కేసులపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఎర్ర చందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. గతంలో చాలా కేసులు పెండింగ్‌లో ఉ్ననాయని వీటిని వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆ కేసులను రద్దు చేసే విషయం కూడా కేబినెట్‌లో ప్రస్తావించే అవకాశం ఉంది.
ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక 27 రోజులుగా ఉన్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 20 రోజులకే కుదించే ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లు ఆమోదంపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా మంత్రివర్గం ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications