వారితో చేతులు కలిపిన కిరణ్, హావభావాలు (పిక్చర్స్)

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తన పార్టీ మధ్య వచ్చే ఓట్ల తేడా కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ చానళ్లతో అన్నారు. కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పారు. కొత్త పార్టీ ప్రకటన సమావేశంలో పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివ రావు, మాజీ మంతి పితాని సత్యనారాయణ, గజల్స్ శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు.

కిరణ్ కొత్త పార్టీ పెట్టాలన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 12వ తేదీన రాజమండ్రి వేదికగా కొత్త పార్టీని ప్రకటిస్తానని అధికారికంగా ప్రకటించారు. అదే రోజు పార్టీ విధి విధానాలు, పార్టీ పేరు, గుర్తులను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి పార్టీ ఏర్పాటు అంశాన్ని ప్రకటించారు.

చేతులు కలిపిన కిరణ్

చేతులు కలిపిన కిరణ్

తమ పార్టీ పదవుల కోసం కాదని, ఆత్మగౌరవం దెబ్బతిన్న తెలుగు ప్రజల కోసం మాత్రమేనని కిరణ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ పార్టీలు విభజనతో తెలుగువారిని విడదీసాయని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయని ఆరోపించారు. అందుకే రానున్న కాలంలో వారిని ఆదుకునేందుకు పార్టీతో ముందుకు వస్తున్నానని వివరించారు.

కిరణ్

కిరణ్

తెలుగు వారు ఉన్న ప్రతిచోటా తమ పార్టీ ఉంటుందని, అవసరం ఉన్న ప్రతి చోటా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తనపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, అయితే తన జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు.

రెడ్డి

రెడ్డి

ఎవరైనా ఆరోపణలను రుజువు చేయవచ్చునని సవాల్ విసిరారు. పాలనలో తాను పారదర్శకతను తీసుకువచ్చానని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పని చేశానని వివరించారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

తన నిర్ణయాలను తిరగదోడడానికి గవర్నర్ ఎవరని ప్రశ్నించారు. ఇటువంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీయే గవర్నర్ ద్వారా ఈ పని చేయిస్తోందా? అన్న ప్రశ్నకు కిరణ్ బదులిస్తూ వచ్చే ప్రజాసామ్య ప్రభుత్వం తన నిర్ణయాలపై తిరగదోడవచ్చునని, గవర్నర్ కాంగ్రెస్ సభ్వత్యం తీసుకోవచ్చునని వ్యాఖ్యానించారు.

కిరణ్‌తో నేతలు

కిరణ్‌తో నేతలు

వాస్తవానికి ప్రభుత్వానికి మేలు చేసేందుకు అనంతపురంలో నాలెజ్డ్ పార్క్, నిజాం సుగర్స్ ప్రయివేటీకరణ ఒప్పందం, సోంపేట విద్యుత్ కేంద్రానికి భూముల కేటాయింపువంటివి రద్దు చేశానని, వాటిపై ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని కిరణ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+