చివరి బంతి వరకు ఆట ముగియదు: కిరణ్ సంచలనం

Kiran Kumar Reddy hot comments on division
హైదరాబాద్: విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విభజన అంశంపై స్పందిస్తూ.. చివరి బంతి పడే వరకు ఆట ముగియదని వ్యాఖ్యానించారు. పార్టీలు ప్రజాభిప్రాయం మేరకు పని చేయాలని, తనకు రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. విభజనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.

సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను కేంద్రం, పార్టీలు పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికారు. విభజన ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించకుండా ముందుకెళ్లడం కష్టమైన పని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన ఇంకా చర్చ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ వల్లనే యూపిఏ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ సమయంలోను ఎపిలో కాంగ్రెసు పార్టీకి 41 స్థానాలు వచ్చాయని గుర్తు చేశారు.

రాష్ట్రం విభజన అంశం చాలా సున్నితమైన అంశమని, దీనిపై కాంగ్రెసు పార్టీ, కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విభజనపై అధిష్టానం సున్నితంగా వ్యవహరించాలన్నారు. తాగునీరు, విద్య తదితర సమస్యలను విభజనకు ముందే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విభజన తర్వాత అది సాధ్యం కాదన్నారు. విభజన ద్వారా తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపించాకనే ముందుకెళ్లాలన్నారు.

ఒక ప్రాంతంగా ఉంటేనే కృష్ణా, గోదావరి జలాలను వాడుకోవచ్చునని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందన్నారు. సాగునీటి సమస్యలపై రాష్ట్రాలు మధ్య వేసిన అన్ని సంఘాలు విఫలమయ్యాయన్నారు. తాను హైదరాబాదులోనే పుట్టి, ఇక్కడే పెరిగానని.. హైదరాబాదు మాదే అని చెప్పడం సరికాదని, ఇది ఆంధ్రప్రదేశ్‌ది అని చెప్పారు. విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోను నష్టమే అన్నారు. సమైక్యాంధ్ర కోసం రోజు లక్షల మంది రోడ్ల మీదకు వస్తన్నారని, ఉద్యోగులు జీతాలు కూడా తీసుకోవట్లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+