మీరు నిత్యం ధ్వేషించే మొఘల్ చక్రవర్తి పుట్టిన గడ్డ అది: ప్రధాని మోదీకి ఒవైసీ చురకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఓలియ్ దరజాలి దోస్త్లిక్.. అందుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. తాష్కెంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ఈ అవార్డును మోదీకి స్వయంగా ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని తనకు దక్కిన వ్యక్తిగత గుర్తింపుగా కాకుండా, 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తూ వారికే అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.

మోదీ ఈ అవార్డును స్వీకరించడం పట్ల అఖిల భారత మజ్లిస్-ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డును అందుకోవడం పట్ల ప్రధాని మోదీ, బీజేపీకి అభినందనలు తెలుపారు. ప్రశంసల వర్షాన్ని కురిపించారు. అదే సమయంలో ఈ అవార్డు వెనుక ఉన్న చారిత్రక కోణాన్ని ప్రస్తావించారు. బీజేపీ గానీ నిత్యం ధ్వేషించే, విమర్శలు గుప్పించే మొఘల్ చక్రవర్తి బాబర్ జన్మించిన దేశం నుంచే ప్రధాని మోదీకి ఈ అత్యున్నత గౌరవం లభించిందని వ్యాఖ్యానించారు.

MP Owaisi Reacts After PM Modi Receives Uzbekistan s Oliy Darajali Dostlik Where Babur Came from

బాబర్ జన్మస్థలం ఫెర్గానా వ్యాలీ ఉజ్బెకిస్థాన్‌లోనే ఉందనే విషయాన్ని ఒవైసీ గుర్తు చేశారు. సంఘ్ పరివార్ నాయకులు, కార్యకర్తలు నిత్యం మొఘలులు, బాబర్ పేరుతో రాజకీయ విమర్శలు చేస్తుంటారని, అదే బాబర్ దేశస్థుల నుంచి ప్రధాని మోదీ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారని, దీన్ని భారత ప్రజలకు సైతం అంకితం చేశారని అన్నారు. దీనిపై ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఒవైసీ హితవు పలికారు.

జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్ సరసన ప్రధాని మోదీ
జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్ సరసన ప్రధాని మోదీ

ఇకపై బాబర్ పేరును తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోరని ఆశిస్తున్నానని అన్నారు. బాబర్ పుట్టిన దేశం నుంచి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నందుకు ప్రధాని మోదీకి, బీజేపీకి ఆయన శుభాకాంక్షలు సైతం తెలిపారు. ఇదిలావుండగా.. ఉజ్బెకిస్థాన్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడానికి కిర్గిజిస్తాన్ చేరుకున్నారు. వివిధ దేశాల నేతలతో దౌత్యపరమైన చర్చల్లో పాల్గొననున్నారు. ఎస్సీఓ సైడ్ లైన్స్ లో భాగంగా నేడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+