గవర్నర్‌తో కిరణ్, ప్రణబ్‌తో ఎంపీలు: కోర్టుకు కృష్ణంరాజు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కిరణ్ గవర్నర్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై హైదరాబాదు నుండి ఢిల్లీ వరకు రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతితో సీమాంధ్ర ఎంపీలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు మధ్యాహ్నం రెండున్నర గంటలకు కలువనున్నారు. విభజన బిల్లును క్షుణ్ణంగా పలిశీలించిన తర్వాతనే దానిని ఆంధ్ర ప్రదేశ్‌కు పంపించాలని కోరనున్నారు.

విభజనపై రఘురామ కృష్ణంరాజు పిటిషన్
రాష్ట్ర విభజనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రఘురామ కృష్ణంరాజు బుధవారం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా విభజన జరుగుతోందని, అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన సరికాదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రుల బృందం(జివోఎం) తెలంగాణ బిల్లును తయారు చేయడాన్ని ఆయన పిటిషన్‌లో వ్యతిరేకించారు.
రాజ్యసభ వాయిదా
సీమాంధ్ర ప్రాంత ఎంపీల నిరసనల నేపథ్యంలో స్పీకర్ మీరాకుమార్ లోకసభను గురువారానికి వాయిదా వేయగా, రాజ్యసభ రెండోసారి సమావేశమైన అనంతరం సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటడంతో డిప్యూటీ స్పీకర్ పిజె కురియన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications