కిరణ్ చెప్పినట్లు వింటారు: జెసి, యముడిగా శివప్రసాద్

JC Diwakar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నూటికి నూరు శాతం తమ పార్టీ అధిష్టానం చెప్పిన మాటను వింటారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గురువారం అన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని, 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డియే కొనసాగుతారని చెప్పారు. కిరణ్ సమైక్యంగా ఉంచాలనే తన అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పారన్నారు.

రాయల తెలంగాణకే తన ఓటు అన్నారు. తాను మొదటి నుండి రాయల తెలంగాణను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. ఈ అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డితో అధిష్టానం పెద్దలు సమావేశమవుతారేమోనన్నారు. మహబూబ్ నగర్ బస్సు ప్రమాదం ఘటన పైన చట్టం తన పని తాను చేసుకు పోతుందని చెప్పారు.

జగన్‌తో ఢిల్లీ పెద్దలకు ఒప్పందం: జెపి

ఢిల్లీ పెద్దలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆరోపించారు. జగన్ మూలాలు కాంగ్రెసులోనే ఉన్నాయని, ఓట్లు, సీట్ల కోసమే విభజన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన అంశానికి శాసన సభకు అనుమతి ఉండాల్సిందేనని చెప్పారు.

శివ ప్రసాద్ వినూత్న నిరసన

వంద రోజుల సీమాంధ్ర ఉద్యమం సందర్భంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివ ప్రసాద్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గురువారం ఉదయం యముడి వేషధారణలో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన అధర్మంగా జరుతోందని యముడు సైతం సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారనే నాటకాన్ని ప్రదర్శించారు. సమైక్య రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడుతామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+