ఆలస్యమొద్దు: కెకె, మాది సమైక్యమేనని రాఘవులు

తెలంగాణ ఏర్పాటును ఇంకా జాప్యం చేయవద్దని కోరారు. ఇప్పటికే తాము నివేదిక ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి ఉండాలని జివోఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు. విభజన తర్వాత హైదరాబాదును మూడేళ్ల పాటు తాత్కాలికంగా రాజధానిగా ఉంచాలని కోరామన్నారు.
నీటి కేటాయింపులలో తెలంగాణ ప్రాంతానికి ఇన్నాళ్లు తీరని అన్యాయం జరిగిందని, ఇదే విషయాన్ని ఫజల్ అలీ కమిషన్ కూడా చెప్పిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను నిర్మించాలని కేంద్రాన్ని కోరామన్నారు.
సమైక్యమే: రాఘవులు
కేంద్ర మంత్రుల బృందానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆదివారం లేఖ రాశారు. తాము సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications