తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎంపీ ఎంఎ ఖాన్?

ఎంఎ ఖాన్‌తో ఇప్పటికే రెండు దఫాలుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే రెండు సార్లు చర్చించారు. ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కాంగ్రెసు ఆంధ్రప్రదేశఅ వ్యవహారాల ఇంచార్జీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ కూడా ఆయన చర్చించారు. దీంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
తెలంగాణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో ముస్లింలను ఆకట్టుకునే ఉద్దేశంతో ఖాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా కాంగ్రెసు అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు.
షబ్బీర్ అలీ దిగ్విజయ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటనలో ఆయన ప్రముఖంగా కనిపించారు. మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ పక్కనే షబ్బీర్ అలీ కూర్చున్నారు. దీన్నిబట్టి షబ్బీర్ అలీకి అధిష్టానం వద్ద మంచి పలుకుబడే ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, షబ్బీర్ అలీని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించే ఉద్దేశం కూడా అధిష్టానానికి ఉండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications