ఎన్టీఆర్ మృతిపై కేంద్ర,రాష్ట్రాల దర్యాప్తు-వివేకా కేసులో చంద్రబాబు,లోకేష్ నీ-కొడాలి నాని డిమాండ్
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మృతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు కోరబోతున్నట్లు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. జగన్ బాబాయ్ హత్యపై లోకేష్, చంద్రబాబు విమర్శల్ని తిప్పికొట్టారు.
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా చేస్తున్న విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా బాబాయ్ వివేకా హత్యలో జగన్, భారతి పాత్ర ఉందంటూ చేస్తున్న విమర్శలు, ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి.. ఎన్టీఆర్ హత్యకు కారణమై, దాంతో లబ్ది పొందిన వారు ఇప్పుడు వివేకా హత్యతో ఎలాంటి ప్రయోజనం పొందని జగన్ పై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా లోకేష్, చంద్రబాబు, ఎల్లో మీడియాపై కొడాలి తీవ్రంగా విరుచుకుపడ్డారు.

లోకేష్ విమర్శలపై కొడాలి ఫైర్
చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్... సీఎం జగన్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి నేను, వంశీ వెళ్లితే పారిపోయిన చవట దద్దమ్మ అన్నారు. ఇప్పుడు జగన్ రెడ్డీ రా అని పిలుస్తున్నాడన్నారు. చంద్రబాబు ముసలోడు కాబట్టే నిన్ను పాదయాత్రకు పంపాడన్నారు. నీకు మాట్లాడటం రాదు, తినటానికి తప్ప ఆ నోరు దేనికీ పనికిరాదన్నారు. కాసేపు జనం నీలాంటి కొడుకు పగోడికి కూడా వద్దని ప్రార్ధిస్తున్నారని కొడాలి విమర్శించారు. ముష్టి 10 కిలోమీటర్లు నడవడానికి తొడలకు మంట పుడుతోంది, ఆయిల్ రాయాలంట అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. లోకేష్ చంద్రబాబును తిట్టుకోవాలి తనను రోడ్లపై తిప్పుతున్నందుకు అన్నారు. ఖాళీ స్ధలాల్లో బహిరంగసభలు పెట్టుకోమంటే ఇరుకుసందుల్లో పెడుతున్నాడంటూ విమర్శించారు. బహిరంగసభలు పెట్టుకోవద్దంటే బిల్డింగ్ లు ఎక్కి సభలు పెడుతున్నాడన్నారు. నారావారిపల్లె నుంచి వలసవెళ్లిపోయిన కుటుంబం మీదేనన్నారు. దత్తపుత్రుడు కూడా హైదరాబాద్ కు వలసవెళ్లిపోయాడన్నారు. మీ కుటుంబం అంతా హైదరాబాద్ కు వలసవెళ్లిపోయినవాళ్లేఅప్పుడు ముఖ్యమంత్రి మిమ్మల్ని వలస పంపారా అని కొడాలి ప్రశ్నించారు. మంగళగిరికి నిన్న వలస పంపిందెవరు
ఇవాళ్టికీ హైదరాబాద్ వలసవెళ్లి టూరిస్టుల్లా వచ్చి చంద్రబాబు, పవన్, లోకేష్ మాట్లాడుతున్నారన్నారు.

వివేకా హత్య విమర్శలపై
జగన్ బాబాయ్ ను చంపారని విమర్శిస్తున్న లోకేష్.. నీ బాబాయ్ ను ఏం చేశారో ముందు చెప్పు అని కొడాలి సవాల్ విసిరారు. అసలు రామ్మూర్తినాయుడు ఎక్కడున్నాడు, ఆయన బతికే ఉన్నాడా, కనపడుతున్నాడా అని అడిగారు.
వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతోందని, హంతకుడి కుటుంబ సభ్యులు అనుమానాలతో సీబీఐకి ఫిర్యాదు చేశారని, సీబీఐ అన్ని కోణాల్లో విచారణ జరపాలన్నారు. ఎంపీ అవినాష్ అయినా, ఆయనతో మాట్లాడిన వారితో విచారణ జరుపుతుంటే వీరే దోషులని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు భార్య గురించి మాట్లాడితే వెక్కివెక్కి ఏడ్చారని, ఇప్పుడు భారతి గురించి ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జగన్ ఇంటికి వెళ్లాక మాట్లాడాలంటే ఓఎస్డీ కృష్ణమోహన్ తోనో, నవీన్ తో అయినా మాట్లాడుతుంటామని, అవినాష్ అయినా నేనైనా వాళ్లతోనే మాట్లాడతామన్నారు. వివేకా చనిపోయాక అవినాష్ అక్కడ ఆయనకు వచ్చిన సమాచారం నలుగురికి చెప్పాడని, ఇందులో మీ కొంపలేం మునిగిపోయాయని కొడాలి ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేష్ నూ విచారించాల్సిందే
వివేకా హత్యపై సీబీఐ ఇంకో కోణంలోనూ విచారించాలని కొడాలి డిమాండ్ చేశారు. వివేకా హత్య సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఫోన్ కాల్స్ విచారించాలన్నారు. ఆరోజు చంద్రబాబుతో ఇంటెలిజెన్స్ ఛీఫ్ వెంకటేశ్వరరావు, కడప టీడీపీ వాళ్లతో ఏం మాట్లాడారో సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నాడని, ఆ తర్వాత మూడు నెలలు సీఎంగా కొనసాగారని గుర్తుచేశారు. ఎందుకు ఛార్జిషీట్ వేయలేకపోయారు, జగన్ , అవినాష్ ను ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదని కొడాలి నిలదీశారు. సీబీఐని ఎందుకు బ్యాన్ చేసారు. హత్యా రాజకీయాల్ని సీబీఐ బయటపెడుతుందనే బ్యాన్ చేశారా అని ప్రశ్నించారు. సీబీఐ ఏం చేస్తుందో ఎల్లో మీడియా ఎలా చెబుతోంది. వీళ్లు చెప్పినట్లే సీబీఐ పనిచేస్తుందా అని అడిగారు. లోకేష్, చంద్రబాబుతో పాటు మిగతా వాళ్ల ఫోన్ కాల్స్ ను సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు.

ఎన్టీఆర్ వారసులకే ప్రమాదాలెందుకు ?
టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు వస్తున్నారని, ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు జూనియరే అని చెప్పించుకున్న సందర్భంలో తారకరత్న, తానూ పాదయాత్ర చేస్తానన్నాడని కొడాలి గుర్తుచేశారు. తారకరత్న ఈసారి పోటీ చేస్తానని కూడా చెప్పాడని, యాక్టివ్ గా తిరగాలనుకున్నాడని, ఆయన తిరిగితే లోకేష్ ను ఎవరు పట్టించుకుంటాడని కొడాలి ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిజమైన వారసులు టీడీపీలోకి యాక్టివ్ గా వచ్చి పనిచేయాలనుకుంటే వారికి హార్ట్ అటాక్ లు ఎందుకొస్తున్నాయి, ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.సీబీఐ విచారణ చేయించగలరా అని కొడాలి ప్రశ్నించారు. ఎన్టీఆర్ చావుతో ముఖ్యమంత్రి పదవి ఎవరికి వచ్చింది, టీడీపీ ఎవరి చేతుల్లోకి వెళ్లింది చంద్రబాబు చేతుల్లోకేగా అన్నారు.

ఎన్టీఆర్ మరణంపై కేంద్ర, రాష్ట్రాల దర్యాప్తుకు డిమాండ్
ఎన్టీఆర్ మరణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారని కొడాలి గుర్తుచేశారు.
వివేకా చనిపోతే జగన్ కు ఏం ఆస్తి వచ్చింది, జగన్ కు ఏమైనా పదవులు వచ్చాయా అని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా, జగన్, కేసీఆర్ ను ప్రత్యక్షంగా కలిసైనా ఎన్టీఆర్ మరణం గుట్టు విప్పాలని కోరతానని కొ డాలి ప్రకటించారు.
ఆయన రాష్ట్ర సంపద. చంద్రబాబు సీఎంగా ఉండగా ట్రస్టు లాక్కుని, పదవి లాక్కుని ఒంటరివాడిని చేసి, సొంత పార్టీ పెట్టుకున్న ఆయన చావుకు కారణమయ్యాడన్నారు. ఎన్టీఆర్ చావు తర్వాత పోస్టుమార్టం జరగలేదని, ఎలాంటి దర్యాప్తు జరగలేదు, ఎన్టీఆర్ శరీరం కమిలిపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్టీఆర్ మరణం వెనుక కారణాలపై దర్యాప్తు చేయాలని కొడాలి డిమాండ్ చేశారు. దీనిపై జగన్, కేసీఆర్, మోడీ, అమిత్ షాకు లేఖలు రాయబోతున్నానన్నారు. అపాయింట్ మెంట్లు ఇస్తే కలిసి వివరణ ఇస్తానన్నారు. బిల్డప్ లు ఇస్తున్న చంద్రబాబు, లోకేష్ కు శిక్ష పడేలా చూడాలని కోరతానన్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications