చంద్రబాబు అవన్నీ తెలిసిన వ్యక్తి - కొడాలి నాని..!!
టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారం పైన వైసీపీ మాజీ మంత్రులు వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఈ నోటీసుల వ్యవహారం పైన చంద్రబాబు ఎందుకు స్పందించరని నిలదీస్తున్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన అవినీతి బయట పడుతోందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పొత్తుల రాజకీయం పైన వ్యాఖ్యలు మొదలయ్యాయి.
ఆదాయపన్నుశాఖను మేనేజ్ చేయడానికి చంద్రబాబు మోడీ కాళ్లు పట్టుకోవచ్చని కొడాలి నాని ఘాటు విమర్శలు చేసారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ ఆరోపించారు. దొంగ చట్టాలను అడ్డం పెట్టుకొని, వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బుని ఎలా దోచుకోవాలో? ఎలా దాచుకోవాలో తెలిసిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి సింగపూర్ లో హోటల్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

చంద్రబాబు ఇప్పటి వరకు రెండు ఎకరాలతోనే బతికారా అంటూ కొడాలి నాని నిలదీసారు. 2014లో ఓడిపోయినా జగన్ 2019లో సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేసారు. పొత్తులు వద్దని ధైర్యంగా ప్రజల పై నమ్మకంతో ఎన్నికల్లోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పడతారని ధ్వజమెత్తారు. బీజేపీని వాటేసుకుంటారు, కాంగ్రెస్ తో కలుస్తారనంటారంటూ ఫైర్ అయ్యారు. ఎవరి కాళ్లు పట్టుకొని అయినా మేనేజ్ చేయటానికి ప్రయత్నించే చంద్రబాబు..రాష్ట్ర ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరంటూ కొడాలి నాని సీరియస్ అయ్యారు.












Click it and Unblock the Notifications