మంత్రి పదవిపై కొడాలి నాని క్లారిటీ : సీఎం జగన్ తో అనుబంధంపై - విశ్వరూపం చూపిస్తా..!!

ఏపీలో కేబినెట్ విస్తరణ సమయంలో మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రిగా ప్రతిపక్ష నేతను టార్గెట్ చేయటంలో ముందుండే కొడాలి నాని కేబినెట్ లో కొనసాగుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు పక్కగా పాటించే జగన్...ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి ఖచ్చితంగా కేబినెట్ లో బెర్తు కొనసాగించాల్సి ఉంటంది. ఇప్పటి వరకు కొడాలి నాని కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, ఆయను ప్రత్యేక పరిస్థితుల్లో కొనసాగిస్తారనే ప్రచారమూ సాగింది. కానీ, ఇప్పుడు కొడాలి నాని వ్యాఖ్యలతో దీని పైన క్లారిటీ వచ్చేసింది.

కొడాలి నాని డిసైడ్ అయిపోయారా

కొడాలి నాని డిసైడ్ అయిపోయారా


సీఎం జగన్ ఓపెన్ గా చెప్పకపోయినా..తన మంత్రి పదవి విషయంలో ఏం జరగనుందనే అంచానకు మంత్రి వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాను వారం రోజుల్లో ఫ్రీ అయిపోతానని..అప్పుడు తన విశ్వరూపం ఏంటో చూపిస్తానంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి పదవి తనకు ఒక లెక్క కాదని చెప్పుకొచ్చారు. తాను బతికి ఉన్నంత కాలం జగన్ తోనే నడుస్తానని మంత్రి స్పష్టం చేసారు. తనకు సీఎం జగన్ మంత్రి పదవి ఇవ్వటంతో బాధ్యతగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పారు. మరో వారంలో ఫ్రీ బర్డ్ అవుతానని..అప్పుడు చంద్రబాబు సంగతి చూస్తానంటూ వ్యాఖ్యానించారు. గుడివాడలో వరుసగా నాలుగు సార్లు గెలిచానని చెబుతూ.. 2024 లో మరోసారి ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు.

గుడివాడలో ఎవరూ అధిగమించలేరంటూ

గుడివాడలో ఎవరూ అధిగమించలేరంటూ

గుడివాడలో తన రికార్డులను ఎవరూ అధిగమించలేరని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. అయితే, మంత్రిగా కొడాలి నాని ఇక కంటిన్యూ అయ్యే అవకాశం లేదనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. సీఎం జగన్ నుంచి ఏమైనా ఆయనకు సంకేతాలు అందాయా.. లేక, ఆయన ముందస్తుగానే తన విషయంలో సీఎం కు ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటాననే సంకేతాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, కొడాలి నానికి పార్టీ పరంగా టీడీపీ ప్రభావిత జిల్లాల బాధ్యతలు అప్పగిస్తారంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఆయనకు క్రిష్ణా- గుంటూరు జిల్లా రీజనల్ బాధ్యతలను అప్పగిస్తారని చెబుతున్నారు. అదే సమయంలో.. కొడాలి నాని స్థానంలో కేబినెట్ లో కొత్తగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

బ్రతికున్నంత వరకూ జగన్ తోనే..

బ్రతికున్నంత వరకూ జగన్ తోనే..

క్రిష్ణా జిల్లా నుంచి వసంత క్రిష్ణప్రసాద్.. ఎమ్మెల్సీ తలశిల రఘురాం రేసులో ప్రముఖంగా ఉన్నారు. పశ్చిమ గోదావరి నుంచి అబ్బయ్య చౌదరి పేరు వినిపిస్తోంది. అయితే, కమ్మ సామాజిక వర్గానికి క్రిష్ణా జిల్లా నుంచే ఛాన్స్ ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే, ఎవరి పేరు సీఎం ఎంపి చేస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ వ్యవహారం పైన ఏప్రిల్ 7న జరిగే కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక, కొడాలి నానికి మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే..ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా ఆయన ముందుగు సాగనున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్పష్టం చేసారు. దీంతో..రానున్న రోజుల్లో కొడాలి నాని వర్సెస్ టీడీపీ రాజకీయం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పుట్టించటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+