స్వగ్రామంలో ఆత్మీయుడి జ్ఞాపకం-అంపాపురంలో కేవీపీ వైఎస్సార్ విగ్రహావిష్కరణ

విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికీ, ఆయన ఆత్మగా పేర్కొనే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకూ మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే కాదు ఆయన చనిపోయిన తర్వాత కూడా నిత్యం వైఎస్సార్ ను సందర్భం వచ్చినప్పుడల్లా కేవీపీ తలచుకుంటూనే ఉంటారు. ఇవాళ మరోసారి ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్నటికీ గుర్తుండిపోయేలా కేవీపీ వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేశారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కృష్ణాజిల్లాలోని అంపాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని కేవీపీ రామచంద్ర రావు, డాక్టర్ నాగేశ్వరరావు, సుధ దంపతులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ అంపాపురం గ్రామంలో వైఎస్సార్ కాంస్య విగ్రహం పునఃప్రారంభించామని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ నాగేశ్వరరావు, సుధ దంపతులు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ విగ్రహం ఏర్పాటుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

kvp ramachandra rao inagurates soulmate late ysr statue in own village ampapuram

మహా నాయకుడు మనకు‌ దూరమైన రోజు ఈరోజన్నారు. అందరూ ఎంతో ఆవేదనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జ్ఞాపకం చేసుకుంటున్నారని అన్నారు. కష్టాలలో ఉన్న కాంగ్రెస్ బాధ్యతలను రఘువీరారెడ్డి భుజాన వేసుకున్నారని, ఆ వారసత్వ కష్టాలను ఇప్పుడు శైలజానాథ్ మోస్తున్నారని తెలిపారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్‌కు సూచనలు చేస్తూ తలలో నాలుకలా ఉండేవారన్నారు. ఏఐసీసీకి, పీసీసీకి వారధిగా ఉండవల్లి వ్యవహరించే వారని అన్నారు. దుట్టా రామచంద్రరావు వైయస్సార్‌కు ఏకలవ్య శిష్యుడని చెప్పారు. ఎంతమంది ఈరోజు ఇక్కడకు వచ్చి వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారని కేవీపీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+