కిలాడీ లేడీ: సెక్సీ పిలువుతో పడేస్తోంది, ఆ తర్వాత....

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: కొంత మంది పురుషులపై కన్నేస్తుంది. ఆ తర్వాత బావా ఇంటూ సెక్సీగా ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇంటికి వచ్చిన మగాళ్లకు ఆ తర్వాత చుక్కలు చూపిస్తుంది. ఇంట్లోకి అడుగు పెట్టిన మగాళ్లపై ముగ్గురు మగాళ్లను ఉసిగొల్పుతుంది. ఒంటి మీది బంగారం, జేబుల్లోని డబ్పులు లాగేసి రోడ్డు మీద పడేస్తుంది.

ఈ లేడీ ఉదంతం ఇటీవల అనూహ్యంగా బయటపడింది. తన ముఠాతో కలిసి ఓ వక్తి ఆస్తినే తన పేర రాయించుకున్న సంఘటన బయటపడింది. కృష్ణా జిల్లా విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన జరిగింది. ఇబ్రహీంపట్నం వార్డు సభ్యుడు చంటి ఈ గ్యాంగ్‌ లీడర్‌ అని పోలీసులు చెబుతున్నారు. చంటి సహా నలుగురిని అరెస్టుచేశారు.

కొన్ని నెంబర్లను ఎంపిక చేసుకుంటుంది. ఆ తర్వాత ఫోన్ చేస్తుంది. ఒకసారి ఆ ఫోన్ ఎత్తకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుంది. అవతలి నుంచి ఫోన్ ఎత్తగా మాటల మాయతో వల విసురుతుంది. తనకు పరిచయం లేదని చెప్తే పెళ్లిలోనో మరో చోట కలిశారంటూ నమ్మబలికి, తొలి చూపులోనే తన మనసు దోచుకున్నారని తీయగా చెప్పేస్దుంది.

Lady cheats men in Krishna district of AP

వచ్చినవాళ్లకు మర్యాదలు బాగానే చేస్తుంది. కుర్చీ చూపిస్తుంది, ఫ్యాన్‌ వేస్తుంది. ఉండు, బావా కాఫీ తేస్తానంటూ వంటింట్లోకి వెళ్తుంది. కాఫీ రాదు గానీ ముగ్గురు కండలు పెంచిన వ్యక్తులు వచ్చేస్తారు. తాను లేనప్పుడు తన భార్య వద్దకు వచ్చావంటూ ఓ వ్యక్తి తగాదాకు దిగుతాడు. అవతలి వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన్నేస్తారు.

ఒక్కడు కొడుతుంటాడు, మరొకడు దుస్తులు విప్పేసి నగ్నంగా ఫొటోలు తీస్తాడు, ఒంటి మీద ఉన్న బంగారం, జేబులోని డబ్బులు, ఎటిఎం కార్డులు... ఏవి ఉంటే అవి లాగేసుకుంటారు. బయటకు వెళ్లి గొడవ చేస్తే నగ్న దృశ్యాలను యూట్యూబులోనో, వాట్సప్‌లోనో పోస్టు చేస్తామని బెదిరిస్తారు. ఇలా ఎనిమిది మందిని ఆ కిలాడీ లేడి బుట్టలో వేసుకుని మోసం చేసినట్లు గుర్తించారు.

పటమటకు చెందిన ఓ వ్యక్తి అదే అనుభవం ఎదురైంది. అతని జేబులో కేవలం రూ. 200 మాత్రమే దొరికాయిజేబులు వెతికితే రూ.200 దొరికాయి. అవి తీసుకొని అప్పటికి వదిలేశారు. అక్కడినుంచి ఫోన్‌ చేసి వరుస బెదిరింపులకు పాల్పడటం ప్రారంభించారు. ఆ వేధింపులు భరించలేక అతడు ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసేశాడు. అతడి ఇల్లు తెలుసుకుని, అతన్ని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు. అతని ఆస్తి అంతా రాయించేసుకున్నారు.

కాగా, ఇబ్రహీపట్నం గ్రామపంచాయతీలో 18వ వార్డు సభ్యుడు చంటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. అతడికి కొండపల్లిలో ఇల్లు ఉంది. అక్కడే ఈ ముఠా తిష్టవేసింది. ఆ ఇంట్లో ఓ యువతిని, మరో ఇద్దరు స్నేహితులను ఉంచి, కథ నడిపిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gang with a lady has been nabbed by police for cheating at Vijayawada of Andhra Pradesh.
Please Wait while comments are loading...