మహిళపై అత్యాచారంచేసి ఇలా .....
అనంతపురం పట్టణానికి సమీపంలో దొరికిన ఓ మహిళ మృతదేహం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అనంతపురం:అనంతపురం జిల్లాలో ఓ మహిళ మృతదేహం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతురాలి వివరాలు లభ్యం కాలేదు.
అనంతపురం పట్టణంలోని హైద్రాబాద్ కు వెళ్ళే ప్రయాణీకులు తపోవనం కూడలిలో రాత్రి 11 గంటల నుండి 12 గంటలవరకు బస్సుల కోసం ఎదురుచూస్తుంటారు. బెంగుళూరు నుండి హైద్రాబాద్ వెళ్ళే బస్సుల సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకొంటాయి.

అయితే బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను మాయమాటలతో తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేశారా లేదా మరేవరైనా అనేది తేలాల్సి ఉందని పోలీసులు చెబతుున్నారు.
తపోవనం నుండి స్టాలిన్ నగర్ కు వెళ్ళే దారిలో డాల్డా పరిశ్రమ ఉంది. అయితే ఇక్కడ పోకిరిల బెడద ఎక్కువగా ఉంటుంది.
డాల్డా పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక శక్తుల ఆగడాలు పెరిగిపోయాయని చెబుతున్నారు.అయితే మృతురాలి ఒంటిపై ఎరుపురంగు చీరె,జాకెట్ ధరించి ఉంది. చెప్పులు, నల్లపూసల దండ సంఘటనా స్థలంలో లభించింది.
మృతురాలి వయస్సు సుమారు 35 ఏళ్ళు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.ఆమె శరీరం గుర్తు పట్టడానికి వీలులేకుండా మారిపోయింది. ఆస్థిపంజరమే మిగిలింది.












Click it and Unblock the Notifications