వ్యాపారం చేయలేం - ఏపీలో మద్యం వ్యాపారుల కీలక నిర్ణయం..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తెచ్చింది. రూ 99కే క్వార్టర్ మద్యం అమ్మకాలు సాగిస్తోంది. లిక్కర్ రెవిన్యూ పెరిగింది. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. తాజాగా కేబినెట్ భేటీలో కొత్త బార్ పాలసీకి ఆమోదం తెలిపారు. ఈ పాలసీ మేరకు టెండర్ల దాఖలు కోసం ఎక్సైజ్ శాఖ కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసింది. వీటిని మద్యం వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాగే కొనసాగితే తాము మద్యం వ్యాపారం చేయలేమని తేల్చి చెబుతున్నారు.
మేము చేయలేం
ఏపీ ప్రభుత్వం కొత్తగా బార్ పాలసీ ఖరారు చేసింది. కొత్తగా బార్ల ఏర్పాటు పైన విధి విధానాలను ప్రకటించింది. అయితే, అసలు ఇప్పుడు ఈ కొత్త బార్ పాలసీ సక్రమంగా అమలు సాధ్యమేనా అనే సందేహం మొదలైంది. ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చిన ఈ మద్యం పాలసీ పైన మద్యం వ్యాపారుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వం పెడుతున్న నిబంధనలతో వ్యాపారం చేయలేమనే నిర్ణయానికి వస్తున్నారు. అసలు బార్ కోసం దరఖాస్తులే చేయకూడదని వ్యాపారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడు జిల్లాలు మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో వ్యాపారు లు సమావేశాలు నిర్వహించారు. ఎవ6రైనా కొత్తవారు వస్తే సరే గానీ, తమలో ఎవరూ దరఖాస్తు చేయకూడదని వారు నిర్ణయించారు.

ఏంటీ నిబంధనలు
బార్ పాలసీలో భాగంగా తీసుకొచ్చిన నిబంధనల్లో ప్రధానంగా ప్రతి బార్‌కు 4 దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధన, ఇష్యూ ప్రైస్‌పై 15 శాతం అదనంగా అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్(ఏఆర్‌ఈటీ) వసూలు అంశాల పై వ్యాపారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త బార్ పాలసీలో ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తు లు తప్పనిసరిగా రావాలనే నిబంధన పెట్టింది. అంటే.. ఏదైనా బార్‌కు నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే దానికి లాటరీ తీయకుండా ఆపేస్తా రు. దీంతో బార్ లైసెన్స్ కావాలనుకునే వారు కచ్చితంగా 4 దరఖాస్తులు సమర్పించాలి. ఒక్కో దరఖాస్తుకు రూ.5 లక్షలు రుసుము. అయితే లైసెన్స్ వచ్చినా, రాకపోయినా దరఖాస్తు రుసుము తిరిగి ఇవ్వరు. దీంతో లైసెన్స్ కావాలనుకునేవారు వేర్వేరు పేర్లతో రూ.20 లక్షలు వెచ్చించి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వాట్ నెక్స్ట్
అదే సమయంలో గత ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యంపై అదనంగా విధించిన ఏఆర్‌ఈటీని ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సాధారణంగా మద్యం షాపులకు ఇష్యూ ప్రైస్‌పై మద్యం సరఫరా చేస్తారు. అంటే ఎమ్మార్పీలో లైసెన్సీకి ఇచ్చే మార్జిన్ మినహాయించుకుని మద్యం ఇస్తారు. ఉదాహరణకు ఒక సీసా ఎమ్మార్పీ రూ.100 అయితే, షాపులకు రూ.86కే సరఫరా చేస్తారు.రూ.14 షాపులకు దక్కుతుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యానికి ఇష్యూ ప్రైస్‌పై అదనంగా ఏఆర్‌ఈటీని విధించింది. వీటి పైన మద్యం వ్యాపారులు ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవే నిబంధనలు కొనసాగితే తాము వ్యాపారాలు చేయలేమని తేల్చి చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications