Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువగళం ముగింపు సభ, ప్రత్యేక రైళ్లు - పవన్ దూరం..!!

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. దీంతో ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది టీడీపీ. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర డిసెంబర్ 20తో ముగియనుంది. యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 19న వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరనున్నాయి. ఈ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. పవన్ హాజరు కావటం లేదని సమాచారం.

యువగళం ముగింపు సభ
నారా లోకేష్ యువగళం యాత్ర ముగింపు సభను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈనెల 20న విజయనగరం జిల్లాలో యువగళం ముగింపు సభ జరుగనుంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే విధంగా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరనున్నాయి.

Lokesh Yuvagalam Yatra conclude with a mega closing ceremony on 20 December

చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపూర్, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఏడు ప్రత్యేక ట్రైన్లు విజయనగరానికి బయలుదేరనున్నాయి. ఒక్కో ట్రైన్లో 1300 మంది ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు కావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు.

ప్రత్యేక రైళ్లు - భారీ ఏర్పాట్లు
యువగళం ముగింపు సభకు దాదాపు 5 లక్షలమంది ఈ సభకు వస్తారని టీడీపీఅంచనా వేస్తోంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు కావాలని సంబంధిత అధికారులను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. ప్రతీ నియోజకవర్గం నుంచి పార్టీ ఇంఛార్జ్ లు..కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక, ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ కల్యాణ్ తో సహా..నందమూరి బాలయ్యతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ముగింపు సభ నిర్వహణ కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసారు. ఈ సభ ద్వారా టీడీపీ - జనసేన పొత్తు..ఎన్నికల వేళ ఈ సభ ద్వారా సమరశంఖం పూరించాలని నిర్ణయించారు.

పవన్ గైర్హాజరు
యువగళం ముగింపు సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. కానీ సభకు రాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపినట్లు సమాచారం. తనకు 20న వేరే కార్యక్రమాలు ఉన్నాయని, ఈ సభకు తాను రాలేనని టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. టీడీపీ,జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తానని వెల్లడించారు.

ఈ సభ నుంచి చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి మధ్యలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో..ఈ నెల 20న జరిగే ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులను చంద్రబాబు సమాయ్తం చేయనున్నారు. జనసేన నుంచి మనోహర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సభ నుంచి చంద్రబాబు ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+