ఈ ట్రైన్‌కు 6 ఇంజన్లు.. భారతదేశపు అత్యంత పొడవైన రైలు.!
భారతదేశపు అత్యంత పొడవైన రైలుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ఈ రైలు ప్రత్యేకతలు ఏమిటనేది తెలియజేశారు. 3.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు 6 ఇంజన్లతో నడుస్తుంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే భారతదేశపు అతి పొడవైన రైలును 2022 ఆగస్టు 15న ప్రారంభించింది. దీనికి 295 వ్యాగన్లుంటాయి.
సూపర్ వాసుకి పేరుతో సరుకు రవాణా చేస్తోంది. 25,962 టన్నుల బరువుతో నడుస్తుంది. సూపర్ వాసుకి భారతదేశంలోనే అత్యంత పొడవైన లోడ్ చేయబడిన రైలు అని, దీనికి 6 ఇంజన్లు ఉన్నాయని, 295 వ్యాగన్లు కూడా జోడించినట్లు మంత్రి తెలిపారు. కొఠారి రోడ్ నుంచి ఈ రైలు ప్రయాణిస్తున్న వీడియో షేర్ చేశారు.

రైలు ప్రత్యేకతలు: ఐదు గూడ్స్ రైళ్లను కలిపి ఈ పొడవైన రైలును తయారు చేశారు. 3వేల మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను రోజంతా ఉపయోగించడానికి సరిపోయే బొగ్గును సూపర్ వాసుకి తీసుకొస్తోంది. ఇది 90 కార్ల గూడ్స్ రైలు సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ. ఒకేసారి 9వేల టన్నుల బొగ్గును మోసుకెళ్ళగలదు. 267 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 11.20 గంటల్లోనే చేరుకుంటోంది.

ఈ రైలు వేగం కూడా సాధారణ సరుకు రవాణా రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. భారతదేశ అభివృద్ధిలో రైల్వే పెద్ద పాత్ర పోషిస్తోందని, ప్రజల ప్రయాణం సుఖవంతం చేయడమే కాకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కూడా సులువుగా మారిందని అశ్వని వైష్ణవ్ తెలిపారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా గూడ్స్ రైళ్లను నడుపుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications