పూనమ్ కౌర్ చెప్పకనే చెప్పింది.. సింగిల్ లైనర్‌లో ఎంతో మీనింగ్
Poonam Kaur: ఏపీ అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 173 మంది నేడు శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన వారందరూ ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
శాసన సభలో తెలుగుదేశం పార్టీకి 134 మంది సభ్యుల బలం ఉంది. జనసేన- 21, భారతీయ జనతా పార్టీ-8 సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రమాణం తదితరులు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీకే చెందిన జీవీ ఆంజనేయులు- వినుకొండ, పితాని సత్యనారాయణ- ఆచంట, వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు- కాకినాడ సిటీ.. ప్రమాణం చేయలేకపోయారు. శనివారం నాడు వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ముగ్గురూ కూడా నేడు శాసన సభకు హాజరు కాలేకపోయారు.
ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దాన్ని పోస్ట్ చేశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఉద్దేశించి ఈ ట్వీట్ పోస్ట్ చేసినట్లుగా నెటిజన్లు భావిస్తోన్నారు. దీనికి అనుగుణంగానే వారు ఆమెకు రిప్లై ఇస్తోన్నారు.
Loosing as a principled warrior is better than winning as conspiring cheater .#justthoughts
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 21, 2024
కుట్రపూరిత మోసగాడిగా గెలవడం కంటే ఓ నిబద్ధత, చిత్తశుద్ధి గల యోధుడిగా ఓడిపోవడం మేలు.. అంటూ సింగిల్ లైనర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు పూనమ్ కౌర్. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్, హ్యాక్ చేశారంటూ జాతీయ స్థాయి మీడియాలోనూ కథనాలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ట్వీట్ పోస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications