మండుటెండల్లో ఏపీకి చల్లటివార్త
వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకుండానే మార్చి నెలలో ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. దీన్నిబట్టి రాబోయే వేసవి ఎలా ఉండనుందో తలుచుకుంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే రాష్ట్ర వాతావరణశాఖ ప్రజలకు మంచి శుభవార్తను వినిపించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల మరికొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నెలకొంటుందని వెల్లడించింది. దీంతో ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. హిందూ మహా సముద్రం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది తాజాగా బలహీనపడటంతో గాలులు దిశ మారుతోంది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకుందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే అత్యధికంగా మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది. రాబోయే మూడురోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

నైరుతి దిశగా బలమైన గాలులు
ఆవర్తనం బలహీనపడటంతో గాలులు ఉత్తర కోస్తా-యానాం ప్రాంతాల్లో నైరుతి దిశగా వీస్తున్నాయి. రాయలసీమలో తూర్పు వైపు, ఆగ్నేయ దిశ వైపు, దక్షిణ కోస్తాలో గాలుల ప్రభావం ఉంది. దీనివల్ల రాబోయే మూడురోజులపాటు రాయలసీమలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయి. అయితే ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు ఉండే అవకాశం లేదు. అలాగే ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉంటుంది. ఇక్కడ కూడా మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాధారణంగా వానలు కురిస్తే ఆ తర్వాత రోజు నుంచి ఎండలు మండిపోతాయి. ఇప్పుడు వర్షాలు కురవడం కూడా ఇదే మార్పునకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications