బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ హెచ్చరిక
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ కోస్తాంధ్రకు, ఉత్తర తమిళనాడు మధ్య ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, బాటప్ల ప్రకారం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. లోతట్టు ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
పంటపొలాల నుంచి నీరు బయటకు పోయే ఏర్పాట్లు చేసుకోవాలి
అల్పపీడన ప్రభావంతో కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విప్తతుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రబీ సీజన్ కావడంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. దీనికితోడు వరికోతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పంటకు బీమా చేయించుకోవాలని ప్రభుత్వం ఎప్పటినుంచో సూచిస్తోంది. పంట పొలాల నుంచి వర్షపునీరు బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఉద్యానపంటలు సాగుచేస్తున్నవారు చెట్లు పడిపోకుండా వాటికి మద్దతుగా పరికరాలను ఉపయోగించాలన్నారు. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు.

నెల్లూరు, చిత్తూరులో వానలు
ధాన్యాన్ని పండించిన రైతులు తమ పంటలను రోడ్డుపక్కన ఆరబెడుతున్నారు. ఇటువంటి సమయంలో వర్షాలు పడితే ఎలా అని వారంతా ఆందోళన చెందుతున్నారు. అవకాశం ఉన్నంతమేరకు ధాన్యాన్ని అమ్మేయడానికే అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. కాలంకాని కాలంలో తుపాన్లు వస్తే తీవ్రంగా నష్టపోతామని, అలా కాకుండా తక్కువకైనా పంటను అమ్మేయడమే మంచిదనే నిర్ణయానికి వారు వచ్చారు. ఈ ఏడాది అల్పపీడనాలు వరుసగా ఏర్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కోస్తాలో అధిక వర్షపాతం నమోదవగా, రాయలసీమ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. నిన్న ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురవగా, బుధవారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వానలు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications