నిన్న నారా లోకేష్- నేడు పవన్: ఒకే బాట
Mahakumbh 2025: మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. ఘాట్లన్నీ జనసంద్రం అవుతున్నాయి.
కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. త్రివేణి సంగమం ఘాట్లన్నీ కూడా పోటెత్తాయి.

ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లను దాటింది కూడా. కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.
భక్తల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగమం నోస్ పాయింట్‌తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
మహా కుంభ మేళాలో అమృత్ స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధవులు చెబుతున్నారు.
కాగా- ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగస్వామ్యులు కానున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా. నేడు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్ దంపతులు. మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించనున్నారు.
అనంతరం వారాణశీకి బయలుదేరి వెళ్లనున్నారు. విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. వారణాశి ఘాట్‌లను సందర్శించి, గంగా హారతిలో పాల్గొనే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఇదివరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ఆయన ఆలయ దర్శనానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే ఈ యాత్ర ముగించారు.












Click it and Unblock the Notifications