వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపి కొణిదెల కనిపించుట లేదు: చిరంజీవిపై దూసిన మహేష్ 'కత్తి'

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో సినీ క్రిటిక్ మహేష్ కత్తి రాష్ట్ర పార్లమెంటు సభ్యులపై వ్యాఖ్యలు చేస్తున్నారు.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను పక్కన పట్టేసి ఆయన రాజకీయ నాయకులపై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పార్లమెటు సభ్యులు కత్తి దూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు చిరంజీవిపై వ్యాఖ్య చేశారు.

చిరంజీవి కత్తి కామెంట్ ఇలా...

చిరంజీవి కత్తి కామెంట్ ఇలా...

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై మహేష్ కత్తి తన ట్విటర్ వేదికగా వ్యాఖ్య చేశారు. ఎంపీ కొణిదెల చిరంజీవి కనిపించుట లేదు అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుత పార్లమెంటు సభ్యులు ఆందోళన చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్య చేశారు.

ఈ సమయంలో ఎంపీలు..

ఈ సమయంలో ఎంపీలు..

కేంద్ర బడ్జెట్‌లో ఎపికి అన్యాయం జరిగిందని విమర్శిస్తూ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు లోపల, వెలుపల ఆందోళనలకు దిగారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్సిస్తూ సభలో ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెసు ఎంపీ కెవిపి రామచందర్ రావు కూడా పోరాటం చేస్తున్నారు. అయితే, చిరంజీవి మాత్రం పార్లమెంటుకు హాజరు కాలేదు. అందుకే మహేష్ కత్తి వ్యాఖ్య చేశారు.

చిరు పదవి కాలం...

చిరు పదవి కాలం...


మహేష్ కత్తి వ్యాఖ్యపై మెగా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు అనుకూలంగా కూడా నెటిజన్లు మాట్లాడుతున్నరు. రాజ్యసభ ఎంపీగా చిరంజీవి పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీతో ముగుస్తుంది. ఆయనతో పాటు పలువురు రాష్ట్ర రాజ్యసభ ఎంపీల పదవి కాలం కూడా ముగుస్తుంది.

ఎంపీల గురించి మహేష్ కత్తి ఆలా..

ఎంపీల గురించి మహేష్ కత్తి ఆలా..

ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 25 మది లోకసభ సభ్యుల్లో 16 మంది వ్యాపారస్తులని, వాళ్ల వ్యాపార అవసరాలు లావాదేవీలు, లాభాలను పరిరక్షించుకోవడంలో న్న లాలూచీల కారణంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడే ఉత్సుకత చూపించరని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Cine critic Mahesh Kathi made comment against Congress Rajyasbha member and Mega star chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X