అక్రమ సంబంధం: స్త్రీపురుషుల ఆత్మహత్య
విజయవాడ: వివాహేతర సంబంధం ఓ జంట ఆత్మహత్యకు దారితీసిన సంఘటన గుంటూరు జిల్లాలో జరగింది. జిల్లాలోని మాచర్ల పట్టణంలోని చెన్నకేశవనగర్ సమీపంలోని పొలాల్లో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది.
మృతులు బాపట్ల మండలం జమ్మిగుంట్లపాలెంకు చెందిన విద్యుత్ లైన్‌మెన్ మక్కెన శీను, మరో మహిళగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

భార్యను నరికిన భర్త
ఓ భర్త భార్యను గొడ్డలితో నరికిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మైలవరం మండలం దేవునిచెరువు సమీపంలో ఓ భర్త భార్యను గొడ్డలితో నరికాడు. తీవ్రంగా గాయపడిన భార్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కారు బీభత్సం
ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం రాజంపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో గొర్రెల కాపరి మరణించాడు. 40 గొర్రెలు కూడా మరణించాయి.
విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురైన విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వేస్టేషన్ కాలనీకి చెందిన లెంక రవిశేఖర్(17) శుక్రవారం తెల్లవారుజామున రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
గురువారం ఫలితాలు వెలువడ్డాక బయటకెళ్లిన రవిశేఖర్ కోసం తల్లిదండ్రులు రోజంతా వెతికారు. శుక్రవారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసి రోదించారు.












Click it and Unblock the Notifications