నమస్తే తెలంగాణ, 'ఒళ్లంత' అభిమానం (పిక్చర్స్)
నల్గొండ: తెలంగాణ ఇచ్చింది మేమేనని, తెలంగాణ అభివృద్ధి సాధ్యమయ్యేదీ మావల్లేనని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ప్రజలకు విన్నవించారు. చిన్నాచితక పార్టీలతో తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు.
కొన్ని పార్టీలు తెలంగాణ తెచ్చింది తామే అని చెప్పుకొంటూ నెత్తిన కిరీటాలు తగిలించుకుని ఊరేగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని పరోక్షంగా టీఆర్ఎస్ట్‌పై విమర్శలు గుప్పించారు.
ఆ పార్టీ పాలనానుభవం ఎంత? అన్నారు. భువనగిరి సభలో పాల్గొన్న మన్మోహన్ తెలంగాణ తామే ఇచ్చామని, అభివృద్ధి తమ వల్లే సాధ్యమని చెప్పారు.

మన్మోహన్ సింగ్
తెలంగాణ ఇచ్చే క్రమంలో తామెదుర్కొన్న సాధక బాధకాలు, ప్రదర్శించిన చిత్తశుద్ధి గురించి ఢంకా బజాయించారు. కాంగ్రెస్ సంకల్ప బలం, కృషి లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేదా? ఆ విషయం ప్రజలకు తెలుసునన్నారు.

మన్మోహన్ సింగ్
తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నదీ ప్రజలకు తెలుసునని చెప్పారు. ప్రసంగంలో ఎక్కడా తెరాస చిన్నా చితక పార్టీ అంటూ విరుచుకుపడ్డారు.

మన్మోహన్ సింగ్
మీ కృషి త్వరలో వాస్తవ రూపం దాలుస్తోందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని, ప్రధానిగా తనకు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో అనేక పక్షాల నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పారు.

మన్మోహన్ సింగ్
అయినా వెనకంజ వేయకుండా మీ కల నెరవేర్చామని చెప్పారు. తన మాట నిలబెట్టుకున్న సోనియాగాంధీకే మీ ఓటు ఇవ్వాలన్నారు.

మన్మోహన్ సింగ్
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఆవశ్యకతను పలుమార్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కి కాంగ్రెస్ అంకితమవుతుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌కు, సోనియాగాంధీకి చేయూతనివ్వాలని కోరారు.

మన్మోహన్ సింగ్
తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగం, కృషి, అమర వీరుల త్యాగం వృథా కాకూడదని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల తరుణంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

మన్మోహన్ సింగ్
జాతీయస్థాయిలో తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా అగ్రగామిగా నిలబడాలంటే.. పాలనలో, అభివృద్ధిలో ఎంతో అనుభవమున్న కాంగ్రెస్ ప్రభుత్వాలే కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడాలి.

మన్మోహన్ సింగ్
కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం అనుభవం కలిగి, భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండాలనే విషయాన్ని ప్రజలు గమనించాలి. విచక్షణతో వ్యవహరించాలి. రాష్ట్రంలో, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం'' అని వివరించారు.

మన్మోహన్ సింగ్
హైదరాబాద్ ప్రత్యేక ప్రతిపత్తిని, బ్రాండ్ ఇమేజ్‌ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. కొత్త పరిశ్రమలు, వ్యవసాయంసహా అన్నిరంగాల్లో అభివృద్ధి, యువతకు ఉపాధి వంటివి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సమతుల్య అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.

మన్మోహన్ సింగ్
జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతోందని, అమలు చేయలేని హామీ లిస్తోందని బీజేపీని ప్రధాని విమర్శించారు.

మన్మోహన్ సింగ్
ఒక వ్యక్తి చుట్టే కేంద్రీకృతమైన బిజెపి రహస్య అజెండా భారత ప్రజల్లో చిచ్చుపెట్టి అశాంతిని నెలకొల్పడమేనని, లౌకికవాదాన్ని అంతమొందించి విచ్ఛిన్న శక్తులను రెచ్చగొట్టడమే వారి ప్రధాన ధ్యేయమన్నారు.

మన్మోహన్ సింగ్
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చివరలో... మళ్లీ అవకాశమిస్తే అన్నీ నెరవేరుస్తామని హామీ ఇస్తూ 'జై తెలంగాణ' అని నినదిస్తూ ప్రసంగం ముగించారు.












Click it and Unblock the Notifications