రామోజీ రావు, శైలజా కిరణ్‌కు ఏపీ సీఐడీ పిలుపు..!!
అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం కేసు పెట్టిన సీఐడీ అధికారులు ఇదివరకు ఆస్తులను అటాచ్ చేశారు. దీని విలువ 820 కోట్ల రూపాయలు.
ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది మార్గదర్శి చిట్స్ సంస్థ యాజమాన్యం. అవి నిజమని తేలడంతో సీఐడీ అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. తాజాగా రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేశారు.

మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై గతంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగాయి. మార్గదర్శి కార్యాలయాల్లో రోజంతా తనిఖీలను కొనసాగించారు. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ రావును కూడా వారు విచారించారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీ రావు నివాసంలో ఈ విచారణ కొనసాగింది.
ఈ పరిణామాల మధ్య- ఇవ్వాళ ఏపీ సీఐడీ అధికారులు రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శిలో డబ్బులను డిపాజిట్ చేసిన చందాదారుల నిధుల మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. 40 సంస్థలకు వాటిని మళ్లించినట్లు గుర్తించారు. ఈ 40 సంస్థల పేర్లను ఈ జీఓలో పొందుపరిచారు.
ఇదే కేసులో తాజాగా ఏపీ సీఐడీ అధికారులు మరోసారి రామోజీ రావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు మరోసారి నోటీసులను జారీ చేశారు. వారిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10:30 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ మేరకు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ రాజశేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications