జోడిమెట్ల దక్కన్ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ: రూ. 50లక్షల అపహరణ
హైదరాబాద్: ఘటకేసర్ మండల పరిధిలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జోడిమెట్ల వద్ద ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్లతో బ్యాంకులోని లాకర్లను పగలగొట్టి బంగారు ఆభరణాలతోపాటు నగదు అపహరించారు.
మంటలు వ్యాపించడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు రూ. 50లక్షలు అపహరణకు గురైనట్లు బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకులోని ఫర్నీచర్, దస్త్రాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల విలువైన వస్ర్తాలు దగ్ధమైనట్లు సమాచారం.
కొత్తపల్లిలో చోరీ
కరీంనగర్: జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోని 12 తులాల బంగారం, రూ. 20 వేల నగదును అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications