రేపు చంద్రబాబుతో చిరంజీవి భేటీ ? ఎల్లుండి పిఠాపురంలో పవన్ కు ప్రచారం..?
ఏపీలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఎల్లుండి సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం కంటే వ్యూహప్రతివ్యూహాలకు నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చివరి నిమిషంలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కు కూటమి భాగస్వామి అయిన చంద్రబాబుతోనూ భేటీకి చిరు వస్తున్నట్లు సమాచారం.
రేపు హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చి చంద్రబాబుతో చిరంజీవి భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సోదరుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వీడియో విడుదల చేసిన చిరు.. ఇప్పుడు చంద్రబాబుతోనూ భేటీ అయి వాస్తవ పరిస్ధితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ దీనిపై అధికారికంగా అటు టీడీపీ వర్గాలు కానీ, చిరంజీవి వైపు నుంచి కానీ ప్రకటన రాలేదు.

అలాగే ఎల్లుండి పిఠాపురంలో పవన్ భారీ ఎత్తున రోడ్ షోకు ప్లాన్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ పిఠాపురం టౌన్ లో రోడ్ షో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పవన్ కు మద్దతుగా చిరంజీవి కూడా ఇందులో పాల్గొంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అదే రోజు పిఠాపురంలో సీఎం జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మెగాబ్రదర్స్ తో పీాటు ఇతర హీరోలు కూడా రోడ్ షోలో పాల్గొంటే గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications