అర్థమవట్లేదు: ఎస్పీవైపై మేకపాటి, తెరాసపై ఎమ్మెల్యేలు
హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాము అంశాలవారీగా మద్దతిస్తామని, ఎంపీ ఎస్పీవై రెడ్డి ఎందుకు టిడిపిలో చేరారో అర్థం కావడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం అన్నారు. లోటస్ పాండులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ అయ్యింది. మేకపాటిని పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నారు.
అనంతరం మేకపాటి విలేకరులతో మాట్లాడారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంశాలవారీగా ఎన్డీయేకు మద్దతిస్తామన్నారు. ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగితే వ్యతిరేకిస్తామన్నారు. పార్టీ ఎంపీలంతా సముచిత రీతిలో స్పందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారన్నారు. ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోరాడుతామని తెలిపారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఎందుకు పార్టీని వీడారో అర్థం కావడంలేదన్నారు. ఆయన పైన తాము చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఎంపీలంతా తప్పకుండా పార్లమెంటుకు హాజరు కావాలని జగన్ ఆదేశించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామన్నారు.
కెసిఆర్‌కు మద్దతు.. అంశాలవారీగా: టి జగన్ ఎమ్మెల్యేలు
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి అంశాలవారిగా మద్దతిస్తామని తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. తాము తెరాసలో చేరుతామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ నిర్మాణంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications