ఏపీ ప్రజలకు శుభవార్త
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో మార్చి నెల నుంచే ఎండలు కాస్తా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 36 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుంది. మే నెలలో ఎండలు 50 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండలు భరించలేక ప్రజలు ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచనలు కూడా చేస్తున్నారంటే ఎండ తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని 107 మండలాల్లో తీవ్ర గాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయని.. రానున్న రెండురోజులు కూడా వడగాడ్పులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిందని.. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఏపీలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే ఉరుములతో కూడిని మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకు వీచే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిచ్చింది.












Click it and Unblock the Notifications