కెసిఆర్ భేటీలు: తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విస్తరణ

హైదరాబాద్: తెలంగాణలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను విస్తరించడానికి ఆ సంస్థ ఇండియా చైర్మన్ అంగీకరించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్‌ భాస్కర్ ప్రామాణిక్‌తో పాటు హిందూజా చైర్మన్, ఐటిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమవారం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని కెసిఆర్ చెప్పారు. ఇంక్యుబేటర్, టాస్క్, హైఫై అంశాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు. ఆగస్టు ఆరవ తేదీన ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్ ఇండియాకు మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్లకు పౌరసన్మానం చేస్తామని ప్రభుత్వం చెప్పింది.

తెలంగాణకు అనుకూలమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని, ఆ తర్వాత సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఆహార పదార్థాల యూనిట్‌ను నెలకొల్పడానికి ఐటిసి అంగీకరించింది. లక్ష ఎకరాల్లో సర్వీ చెట్లను పెంచే కార్యక్రమానికి కూడా అంగీకారం తెలిపింది. 3,500 కోట్ల రూపాయలతో కాగితపు పరిశ్రమను నెలకొల్పడానికి కూడా ఐటిసి ముందుకు వచ్చింది.

Microsoft to expand activities in telangana

విత్తనోత్పత్తి పద్ధతులపై త్వరలో సదస్సు నిర్వహిస్తామని కెసిఆర్ చెప్పారు. ఈ సదస్సుకు స్వామినాథన్‌ను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. తాను చెన్నై వెళ్లి స్వామినాథన్ ఫౌండేషన్‌ను సందర్శిస్తానని చెప్పారు. స్వామినాథన్ సిఫార్సులు తమకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు. వాటిని అమలు చేసే అవకాశం తమకు వచ్చిందని అన్నారు.

విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలని స్వామినాథన్ సూచించారని ఆయన గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+