అనంతపురంలో భూప్రకంపనలు, రెండుగా చీలిన రోడ్డు
అనంతపురం జిల్లా జీడిపల్లిలో మంగళవారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. వీటి తీవ్రతకు సీసీ రోడ్డు రెండుగా చీలిపోయింది. దీంతో గ్రామస్తులు భయపడి ఇళ్ల బయటకు వచ్చారు.
అనంతపురం: అనంతపురం జిల్లా జీడిపల్లిలో మంగళవారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. వీటి తీవ్రతకు సీసీ రోడ్డు రెండుగా చీలిపోయింది. దీంతో గ్రామస్తులు భయపడి ఇళ్ల బయటకు వచ్చారు.
భూమిలో భారీ శబ్దంతో పాటు భూమి కంపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సుమారు తొమ్మిది సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కిందపడిపోవడంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్థులు ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు.

విషయం తెలుసుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించి భూకంప తీవ్రతను గుర్తించే పనిలో ఉన్నారు. భూమి ఇలా కంపించడం సంవత్సర కాలంలో ఇది రెండోసారి.
కూడేరు మండలం ఎంఎం హళ్లిలో కూడా అతి స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. జిల్లాలోని జీడిపల్లి, ఎంఎం హళ్లి తదితర ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది.












Click it and Unblock the Notifications