మైలేజ్ గేమ్ లో లోకేష్ సక్సెస్-వైసీపీ సర్కార్ అడ్డంకులు అందుకేనా ? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవే !

ఏపీలో అధికార, విపక్షాలైన వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ గేమ్ ఆసక్తికరంగా మారుతోంది. గత ఎన్నికల తర్వాత టీడీపీ పనైపోయిందని భావించిన వైసీపీ ఇప్పుడు మాత్రం అదే మాట చెప్పేందుకు జంకుతోంది. ఎందుకంటే ప్రభుత్వంపై ఈ రెండేళ్లలో పెరిగిన వ్యతిరేకతకు తోడు, దాన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ వరుస పర్యటనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. వీటితో ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో సర్కార్ అప్రమత్తమవుతోంది.

వైసీపీ వర్సెస్ టీడీపీ

వైసీపీ వర్సెస్ టీడీపీ

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరుకు పదేళ్ల చరిత్ర ఉంది. కాంగ్రెస్ నుంచి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీని, అధినేత జగన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టిన టీడీపీకి సొంత మీడియా బలం కూడా కలిసొచ్చింది. అయితే దీన్ని కౌంటర్ చేసే క్రమంలో తొలుత వెనుకబడినట్లు కనిపించిన వైసీపీ.. ఆ తర్వాత మాత్రం భారీగా బలం పెంచుకుంది.

ఇందుకు ప్రధానంగా దోహదం చేసిన అంశం టీడీపీ తప్పిదాలు కాగా.. వైసీపీ వాటిని ఎలివేట్ చేసిన తీరు కూడా. ఇప్పుడు సరిగ్గా ఇదే రివర్స్ అవుతోంది. అప్పట్లో టీడీపీని వైసీపీ టార్గెట్ చేయగా.. ఇప్పుడు వైసీపీని టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో అప్పట్లో జగన్ పై టీడీపీ సర్కార్ అసహనం కనిపించగా.. ఇప్పుడు లోకేష్ పై వైసీపీ సర్కార్ అసహనం కనిపిస్తోంది.

లోకేష్ దూకుడుతో వైసీపీ బేజారు

లోకేష్ దూకుడుతో వైసీపీ బేజారు

టీడీపీ మాజీ మంత్రిగా, ఎమ్మెల్సీగా, అన్నింటికంటే మించి చంద్రబాబు తనయుడిగా పలు హోదాలు కలిగిన లోకేష్.. గత ప్రభుత్వంలో తన హవా కొనసాగించారు. ఆ తర్వాత టీడీపీ ఓటమిపాలవ్వడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత టీడీపీ తిరిగి పుంజుకోవడం కష్టమని అంతా భావిస్తున్న తరుణంలో లోకేష్ జూలు విదల్చడం మొదలుపెట్టేశారు. తనపై ఉన్న ముద్రను క్రమంగా చెరిపేసుకుంటూ తన స్వభావానికి భిన్నంగా వైసీపీ సర్కార్ మాటల దాడిని ప్రారంభించారు. అంతే ఇక టీడీపీ శ్రేణులు కూడా ఆయన వెంట పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు లోకేష్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం మాట్లాడతారో, ఏం విమర్శలో చేస్తారో అని టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా చెవులు రిక్కించి వింటున్న పరిస్ధితి.

లోకేష్ కు జోరుకు అడ్డుకట్ట

టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అంతా నాదేనంటూ వచ్చి వాలిపోతున్నారు. సమస్య కనిపించడం చాలు విమర్శల దాడి మొదలుపెట్టేస్తున్నారు. ప్రభుత్వంపై ఏమాత్రం మోహమాటం లేకుండా రెచ్చిపోతున్నారు. తన స్వభావానికి భిన్నంగా మాస్ డైలాగులతో లోకేష్ రెచ్చిపోతున్న తీరు టీడీపీ కార్యకర్తల్లోనూ జోష్ నింపుతోంది. దీంతో నిన్న మొన్నటివరకూ భవిష్యత్తుపై బెంగతో ఉన్న తెలుగు తమ్ముళ్లు కాస్తా ఇప్పుడు లోకేష్ బాటలోనే పయనిస్తున్నారు.

ఇదంతా తిరిగి వైసీపీ సర్కార్ ను చికాకు పెడుతోంది. దీంతో లోకేష్ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో లోకేష్ ను లైట్ తీసుకున్న వైసీపీ మంత్రులు కాస్తా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కౌంటర్లు ఇస్తున్నారు. సాధ్యమైనంతగా ఆయన వ్యాఖ్యలు జనంలోకి వెళ్లకుండా ప్రయత్నిస్తున్నారు. చివరికి ఆయన టూర్లను సైతం పోలీసులతో అడ్డుకునే పరిస్ధితికి వచ్చేశారు.

ఇంటెలిజెన్స్ నివేదికలే కారణమా?

ఇంటెలిజెన్స్ నివేదికలే కారణమా?

లోకేష్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాల వెనుక ఇంటెలిజెన్స్ నివేదికలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ టూర్లు జరిపిన చోట వైసీపీ ప్రభుత్వానికి రాజీకీయంగా ఇబ్బందులు పెరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ రిపోర్టులతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. అసలు లోకేష్ టూర్ ప్రతిపాదిస్తే చాలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు ముందుకు కదుల్తున్నారు.

రోడ్లపై నిరసనలే కాదు పరామర్శలకు సైతం ఆయన్ను వెళ్లనీయడం లేదు. బాధితులతో ప్రెస్ మీట్లు పెట్టేందుకూ అనుమతివ్వడం లేదు. ఇంతగా లోకేష్ మార్చేయగల పరిస్ధితులు నిజంగానే ఉన్నాయా అంటే వైసీపీ సర్కార్ దగ్గర సమాధానం దొరకడం లేదు. కానీ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే వైసీపీ ప్రభుత్వం లోకేష్ కు అడ్డకట్ట వేసేందుకు ప్రయత్నించి రాజకీయంగా నష్టాన్ని కొని తెచ్చుకుంటోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా లోకేష్ కోరుకున్నదే వైసీపీ ప్రభుత్వం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+