వైసీపీ లీడర్ కు వాగిపోయింది, ఎన్ని కోట్లు ఫైన్ వేశారంటే, జగన్ చూపించిన దారి

గతంలో జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చూపించిన దారిలోనే ప్రస్తుతం టీడీపీ నాయకులు పయనిస్తున్నారు. ఆ ఇంటి నుంచి ఈ ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటి నుంచి ఆ ఇల్లు కూడా అంతే దూరం అనే సామెతను టీడీపీ నాయకులు నిరూపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ నాయకులకు చెందిన గనులు, క్వారీల పైన భారీ మొత్తంలో జరిమానా వి విధించిన విషయం తెలిసిందే.

జగన్ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట వినకుంటే ఆ క్వారీలు ఎవరైనా సరే వాటిని సీజ్ చేయడం, లేదంటే ఆ క్వారీల యజమానులకు కోట్లాది రూపాయల జరిమానా విధించడం చేసి వేధింపులకు గురి చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల టార్చర్ తట్టుకోలేక తెలుగుదేశం పార్టీకి చెందిన అనేకమంది నాయకులు వారి క్వారీలను మూసేశారు.

Mines Department officials seized the quarry of the YCP leader and fined Rs 12 crore

అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు క్వారీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో క్వారీలు నిర్వహిస్తున్న ఇతర పార్టీల నాయకులకు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో మూసేసిన క్వారీలు మళ్లీ ప్రారంభించి వ్యాపారం చేసుకోవడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు సిద్దం అవుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులకి గనుల శాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు.

వైసీపీ నాయకుడికి చెందిన క్వారీలోని క్రషర్లు సీజ్ చేసిన అధికారులు ఆ క్వారీ యజమానికి రూ 12. 89 కోట్ల రూపాయల జరిమానా విధించడం హాట్ టాపిక్ అయ్యింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణం సమీపంలో వైసీపీ నాయకుడికి చెందిన క్వారీపై గనుల శాఖ అధికారులు పంజా విసిరారు. కదిరి మండలం కూటగుళ్ల రెవెన్యూ డివిజన్ లో వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి, ఆయన కుమారుడు సాయి ప్రణీత్ రెడ్డి కలిసి శివ సాయి కన్ స్ట్రక్షన్ పేరుతో క్వారీని లీజ్ కు తీసుకుని నిర్వహిస్తున్నారు.

కొన్ని సంవత్సరాలుగా వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి ఈ క్వారీ నిర్వహిస్తున్నాడు. సుమారు 3, 543 హెక్టార్ల భూమిని వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి లీజ్ కు తీసుకున్నాడని సమాచారం. అయితే గనుల శాఖ అధికారుల నుండి అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ తవ్వకాలు జరిగాయని స్థానికులు అనేకమంది గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల నుండి ఎక్కువ ఫిర్యాదులు రావడంతో గనుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

Mines Department officials seized the quarry of the YCP leader and fined Rs 12 crore

మైనింగ్ శాఖ ఏడి రామ్మోహన్ రావు, ఆ శాఖ అధికారులు వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి క్వారీని పరిశీలించారు. అనుమతి తీసుకున్నదానికంటే ఎక్కువ విస్తీర్ణంలో క్వారీ తవ్వేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి క్వారీలోని క్రషర్ ను సీజ్ చేశారు. వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డికి రూ. 12.89 కోట్ల రూపాయలు జరిమానా విధించిన గనుల శాఖ అధికారులు వెంటనే నగదు ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

గతంలో టీడీపీ నాయకులకు చెందిన క్వారీలను ఇలాగే సీజ్ చేసి వాళ్లకి కోట్లాది రూపాయలు అపరాదరుసుం విధించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే దారిలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పయనిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ చూపించిన దారిలోనే ఇప్పుడు టీడీపీ నాయకులు పయనిస్తున్నారని సమాచారం. మొత్తం మీద వైసీపీకి చెందిన అక్రమ గనులు, క్వారీలపై కూటమి పార్టీల నాయకులు కన్ను వేశారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+