అసత్యాలు చెబుతారు... అడిగితే ఏడుస్తారు : మంత్రి అమర్‌నాథ్‌ ..!!

ఏపీలో పరిశ్రమలు..పెట్టుబడుల పైన టీడీపీ నేతలు చేస్తున్న ప్రచార తీరు పైన మంత్రి అమర్ నాధ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బ తీయాలనే ఉద్దేశంలోనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. ఓర్చుకోలేక అసత్య ప్రచారాలు చేస్తూ.. ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. కంపెనీలు రాకుండా తరిమేయాలని నిరంతరం కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ రోజు తిరుపతి జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రస్తావించారు. దాదాపుగా రూ.4 వేల కోట్లకు పైగా పెట్టుబడులు. 20 వేల ఉద్యోగాలు కల్పించే కంపెనీల ప్రారంభోత్సవం జరిగిందన్నారు.

వైసీపీఅధికారంలోకి వచ్చాక, ఇక్కడ ఉన్న అవకాశాలను ప్రపంచ స్థాయిలో ఫోకస్‌ చేసి, యువతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుడుగులు పడ్డాయని వివరించారు. అందుకు ఏ విధంగా ఇక్కడ పెట్టుబ డులు ఎలా ఆకర్షించాలి అన్న దానిపై ప్రభుత్వం ఎంతో దృష్టి పెట్టిందని చెప్పారు. కోవిడ్‌ వల్ల దాదాపు రెండేళ్లు నష్టం జరిగిందన్నారు. ఇక్కడికి ఏ కంపెనీ వచ్చినా, వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తామని సీఎం చాలా స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన చిత్తశుద్థితో పని చేస్తున్నారని వివరించారు. తమ హయాంలోనే టీసీఎల్‌ కంపెనీ వచ్చిందని, దానికి మేము ఇప్పుడు పేరు మార్చామని గతంలో ఐటీ మంత్రిగా పని చేసిన లోకేష్‌ చెబుతున్నారన్నారు.

Minister Amarnath counter Lokesh comments on industries in Tirupati

శంకుస్థాపన చేసిన స్థలంలో నిజంగా టీసీఎల్‌ కంపెనీ పెట్టి ఉంటే తాము ఒప్పుకుంటామని చెప్పారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో ఏం చేశారనేది ప్రజలంతా చూశారని..టీడీపీ నేతలు బీజేపీ అభ్యర్థికి పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చున్నారని విమర్శించారు. తాము ఏది చేసినా చిత్తశుద్ధితో చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి నెలా కొత్తగా కంపెనీలు వస్తాయన్నారు. ప్రారంభోత్సవాలు, భూమిపూజలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. అపాచీతో ఒప్పందం మేరకు 298 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంటు కూడా ఇచ్చామని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేస్తారని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+