పవన్‌ది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన - మంత్రుల ఫైర్..!!

కాపు కులాన్ని మూటగట్టి తీసుకెళ్లి చంద్రబాబుకు అమ్మకానికి పెట్టాలనేదే పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం సారాంశని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి అమర్‌నాథ్‌ ఫైర్అయ్యారు. 175 నియోజకవర్గాల్లో పోటీచేస్తావా అంటే సమాధానం చెప్పే ధైర్యం లేదని ఎద్దేవా చేసారు. ఇంకో రాజకీయ పార్టీతో కలిసి వెళ్తానని నేరుగా చెప్పే ధైర్యం లేదని దుయ్యబట్టారు. పవన్‌ మాటల్లో ఆ పార్టీ విధివిధానాలు, అజెండా, భవిష్యత్తు కార్యాచరణ లేకపోవడం హేయమన్నారు.

అజెండా.. సిద్దాంతాలు లేని పార్టీ

అజెండా.. సిద్దాంతాలు లేని పార్టీ

ఏ అజెండా లేకుండా పది సంవత్సరాలు నడిచిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది పవన్‌ కల్యాణ్‌ పార్టీనే అని మంత్రి అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ సిద్ధాంతాలు, విలువలు, అజెండా లేని పార్టీ జనసేనని విమర్శించారు. దాదాపు నెలన్నర నుంచి బంకర్‌లో దాక్కున్న వ్యక్తి బందర్‌కు వచ్చాడని మంత్రి ఎద్దేవా చేసారు. ఏదో చెబుతాడని పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకున్నారపని... కానీ, జెండా పవన్‌ది.. అజెండా తెలుగుదేశం పార్టీదని మంత్రి చెప్పుకొచ్చారు. కనీసం అజెండా అనేది లేకుండా, పార్టీ ఎందుకు పెట్టానని చెప్పకుండా ప్రసంగించారని పేర్కొన్నారు.

కులాలు లేవంటూనే కులాల పైనే

కులాలు లేవంటూనే కులాల పైనే

ఒకపక్క కుల రహిత సమాజం కోసం రాజకీయ పార్టీని స్థాపించానని చెప్పిన వ్యక్తి.. ఆ సభలో కులాల గురించి ఎంతసేపు మాట్లాడాడో అందరం చూశారన్నారు. అనేక సందర్భాల్లో దత్తపుత్రుడు అని తాము చెబుతూ వచ్చామని.. దానికి జస్టిఫికేషన్‌ చేసుకున్నారన్నారు. అసెంబ్లీకి రావడానికి ఎన్నికల వరకు ఆగడం ఎందుకు.. స్పీకర్‌ను కోరితే రెండు పాసులు ఇస్తారని సెటైర్ వేసారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. తాను ఎవరికి అమ్ముడుపోయినా సరే దాంట్లో మీరు భాగస్వాములు కండి.. మిమ్మల్ని అందరినీ కలిసి తాకట్టుపెట్టేస్తానని పవన్‌ చెబుతున్నారని ఎద్దేవా చేసారు. ఇక్కడ మీ పార్టీ నాయకులకు దమ్ము, ధైర్యం లేదు అనుకుంటే తెలంగాణలో పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు.

అంబటి వరుస ట్వీట్ల సెటైర్లు

అంబటి వరుస ట్వీట్ల సెటైర్లు

జనసేన ఎందుకు పెట్టావంటే సీఎం జగన్‌ను ఓడించడానికే తప్ప.. నాయకులుగా ఎదగడానికి, పార్టీ అధికారంలోకి రావడానికో కాదని పరోక్షంగా చెప్పేశారని చెప్పుకొచ్చారు. అది అర్థం చేసుకోవాల్సింది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలేనని మంత్రి గుడివాడ అమర్‌ అన్నారు. మరో మంత్రి అంబటి రాంబాబు వరుస ట్వీట్లు చేసారు. జ‌న‌సేన ప‌దో ఆవిర్భావ దినోత్స‌వ సందేశం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ది బ‌ల‌మైన సంత‌కం ఉంటుంది.. కానీ, అది ఎల్లో పేప‌ర్ మీదే ఉంటుంది అని ప‌వ‌న్‌కు చుర‌క‌లు అంటిస్తూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు, అదే విధంగా కాపులంద‌రూ న‌డుం బిగించండి.. నాదెండ్ల‌, క‌ల్యాణ్ బాబు ప్యాకేజీ బిగిస్తారు..అంటూ అంబటి ఎద్దేవా చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+