పవన్ అంత మగాడా - మీతో చంద్రబాబు దగ్గర వెట్టిచాకిరీ కోసం: అంబటి..!!

మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో సచివాలయ వాలంటీర్లు - కన్వీనర్ల సమావేశంలో మంత్రి రాంబాబు జనసేనాని పైన ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎప్పుడు ఎవరికి మద్దతిస్తారో.. ఎన్ని పార్టీలను మారుస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. అసలు పవన్ కు రాజకీయాలు తెలుసా అంటూ రాంబాబు ప్రశ్నించారు. వైసీపీని అధికారంలోకి రానివ్వనంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను అంబటి ప్రస్తావించారు.

ఓట్లు చీలనివ్వనని పవన్ చెబుతున్నారని..పవన్ అంత మగాడా అంటూ రాంబాబు ప్రశ్నించారు. కాపులు కొందరు పవన్ మా వాడు అంటూ గోక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కు మద్దతుగా నిలుస్తున్న వారు పవన్ తో కలిసి చంద్రబాబు దగ్గర వెట్టి చాకిరి చేయండంటూ కామెంట్ చేసారు. మద్దతుగా నిలుస్తున్న కాపులు చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో... జగన్ ను నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఒక్క చోట కూడా గెలవలేని పవన్ తన పైన ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. వైసీపీ తాను విమర్శించనంతగా పవన్ ను ఎవరూ విమర్శించరని చెప్పుకొచ్చారు. ఆ కారణంగానే తన పైన జనసేన ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Minister Ambati Rambabu Sensationa comments against Janasena Chief Pawan Kalyan

తన పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారని..ాను ఒక్క పైసా కూడా ఆశించనని చెప్పారు. అలాంటిది తన పైన ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కొంత కాలంగా అంబటి రాంబాబు లక్ష్యంగ జనసేన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ సత్తెనపల్లిలో కౌలు రైతు యాత్ర నిర్వహించారు. మరణించిన రైతు కుటుంబాలకు చెక్ లు అందచేసారు. ఆ సమయంలో మంత్రి అంబటి పైన పవన్ సంచలన ఆరోపణలు చేసారు. దీనికి అంబటి కౌంటర్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు సత్తెనపల్లి కేంద్రంగా అంబటి వర్సస్ పవన్ కల్యాణ్ డైలాగ్ వార్ పతాక స్థాయికి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+