వైసీపీ ఎంతటికైనా తెగిస్తుంది, పేటీఎం చానళ్లు, భజన బ్యాచ్ ఉంది జాగ్రత్త, మంత్రి ఫైర్
విజయవాడలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, వరద బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిపై మిషం కక్కుతున్న వైసీపీకి మొదటి నుంచి అలవాటే అని, రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని, విజయవాడ, అమరావతి ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి రామానాయుడు అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రాంతాల్లోనే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. 1998లో, 2009 కంటే ఎక్కువగా ఇప్పుడు విజయవాడలో వరద నీరు వచ్చిందని, గతంలో కృష్ణా నదిలో ఇంత వరద నీటిని తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ముంపు ప్రాంతం అంటూ వైయస్ జగన్ గతంలో ప్రయారం చేశారని, జగన్ కలను ఆ పార్టీ నాయకులు చాలామంది నిజయం చెయ్యడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కొన్ని పేటీఎం చానళ్లు, పేటీఎం బృందాలు అమరావతిపై, కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
11 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు పోటెత్తినా అమరావతి చెక్కుచెదర లేదని, అమరావతిని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని, విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల ప్రజలకు త్వరలోనే న్యాయం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కృష్ణా కరకట్ట పై మంతెన ఆశ్రమం వద్ద ఇలాంటి పరిస్థితి వచ్చిందని మంత్రి నిర్మల రామానాయుడు ఆరోపించారు.
గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం కరకట్టపై మంతెన ఆశ్రమం వద్ద షట్టర్ కు కనీసం గ్రీజ్ కూడా పెట్టలేదని, ఐదేళ్లుగా బుడమేరు లో ఎక్స్ టెన్షన్ పనులు అస్సలు జరగలేదని, గేట్ల మరమ్మతులు చెయ్యడానికి కన్నయ్య నాయుడు వస్తున్నారని, ఈరోజు రాత్రికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మత్తు పనులు చేస్తారని, బుడమేరుకు పడిన మూడు గంటలకు ఈ రాత్రికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ కు మూడు బోట్లు కొట్టుకు రావడం వెనక వైసీపీ నాయకుల కుట్ర ఉండవచ్చని, ఆ పార్టీ నాయకులు ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధమవుతారని మంత్రి నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications