పవన్ కల్యాణ్ కు మంత్రి బొత్సా సవాల్ - జనంలోకి వెళ్తాం..!!
ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ జనసేనాని పవన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. విద్యా శాఖ ఆంగ్ల భోధన కోసం తీసుకుంటున్న నిర్ణయాలు..బైజూస్ తో ఒప్పందంలో అవినీతి జరిగిందని పవన్ తో సహా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వీటి పైన బొత్సా స్పందించారు. ఈ నెల 26న ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో జనంలోకి వెళ్తామన్నారు. ప్రజలకు చేసిన మంచి వివరిస్తామని వెల్లడించారు.
ఏపీ వై నీడ్స్ జగన్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నారేళ్లల్లో మంచి జరిగిందని మంత్రి బొత్సా వివరించారు. ప్రజలకు జరిగిన మేలును వివిరించటమే లక్ష్యంగా బస్సు యాత్ర ఉద్దేశమని స్పష్టం చేసారు. సామాజిక సాధికార బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువ అవుతామని చెప్పారు. సమాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నేరవేర్చామని చెప్పారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమం..డెవలప్ మెంట్ గురించి 175 నియోజకవర్గాల ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నామని బొత్సా వివరించారు. బెల్టుషాపులు లేకుండా నియంత్రణ చేసామని చెప్పారు.
పవన్ కు అవగాహన లేదు: మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడిగే దమ్ము టీడీపీకి ఉందా అని బొత్సా ప్రశ్నించారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ అంశం పైనా అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారని దుయ్య బట్టారు. బైజూస్ ద్వారా విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ అందిస్తున్నామని చెప్పారు.
పేద విద్యార్ధులు ఇంగ్లీషు మీడియంలో చదవకూడదా అని ప్రశ్నించారు. మన విద్యార్దులు అందరూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ రావాలన్నదే తమ డిమాండ్ అని వెల్లడించారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. బైజూస్ తో ఒప్పందం పైన ఆరోపణలు చేస్తున్న పవన్ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తారా అని సవాల్ చేసారు.
ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం: తన పైన కేసులు పెడతానని పవన్ మాట్లాడుతున్నారని..అధికారంలోకి వస్తున్నట్లు కలలు కంటున్నారని బొత్సా ఎద్దేవా చేసారు. నాలుగున్నారేళ్లుగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని ఉత్తరాంధ్ర పార్టీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ యాత్రలో ప్రతీ ఒక్కరికీ జరిగిన మేలు వివరిస్తామన్నారు. దళితులు..గిరిజనులకు సీఎం జగన్ చేసిన మేలు గతంలో ఎవరూ చేయలేదన్నారు. ఈ నెల 26న ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ కొనసాగుతుందని వెల్లడించారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications