పవన్ కళ్యాణ్ వినతిపై స్పందించిన మంత్రి గంటా, త్రిసభ్య కమిటీ ఏర్పాటు
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు గుర్తించేందుకుముగ్గురు సభ్యుల క
నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.
ఈ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు సందర్శించారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీరయ్య, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో సమస్యలున్న మాట వాస్తవమేనని, అయితే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. వారం రోజుల్లో కొత్త యూనివర్సిటీలో పరిపాలన, తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇటీవల పలు విద్యార్థి సంఘాల నేతలు పవన్ కళ్యాణ్ ను కలిసి విక్రమ సింహపురి యూనివర్సిటీలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి గంటా ఆ యూనివర్సిటీకి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications