• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోకేష్ బాబును బోసడీకే నాన్నా అంటారా? ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని అలా పిలుస్తారా? మంత్రి కన్నబాబు వ్యంగ్యం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పై అధికార పార్టీ నేతల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు టిడిపి కార్యాలయాలపై జరిగిన దాడులపై ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లను కలవనున్నారు అని టిడిపి నేతలు పేర్కొన్న క్రమంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మరోమారు తెలుగుదేశం పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు.

ఆడవారిని తిట్టే నీచ సంస్కృతి టీడీపీది; చంద్రబాబులా జగన్ కుట్రలు చెయ్యలేదు: వాసిరెడ్డి పద్మ, తానేటి వనిత ఫైర్ఆడవారిని తిట్టే నీచ సంస్కృతి టీడీపీది; చంద్రబాబులా జగన్ కుట్రలు చెయ్యలేదు: వాసిరెడ్డి పద్మ, తానేటి వనిత ఫైర్

ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రులను ఆ పదంతో పిలుస్తారా?

ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రులను ఆ పదంతో పిలుస్తారా?

టిడిపి నేతలు ఢిల్లీకి వెళ్లి ఏం చెప్తారు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లను కలిసి వారిని ఆ పదంతోనే పలకరిస్తారా అంటూ నిలదీశారు మంత్రి కన్నబాబు. తెలుగు దేశం పార్టీ ఆఫీసు దేవాలయం అయితే పార్టీని స్థాపించిన దేవుడిపై చెప్పుల దాడి బాబుకు గుర్తులేదా అంటూ నాడు ఎన్టీఆర్ పై చంద్రబాబు దాడి చేయించడంటూ మండిపడ్డారు. పార్టీ ఉందని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నాడంటూ డ్రామాలు ఆడుతున్నాడు అంటూ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలని ఎద్దేవా చేశారు.

తల్లులను కూడా దూషించే స్థితికి దిగజారిన చంద్రబాబు

తల్లులను కూడా దూషించే స్థితికి దిగజారిన చంద్రబాబు

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విష ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలనే కుట్రకు చంద్రబాబు తెర తీశారని, అందులో భాగంగానే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలో భాగంగా పూర్తిగా తానే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ ఒక స్కిట్ నడిపించాడు అంటూ అసహనం వ్యక్తం చేశారు. బజారు భాష మాట్లాడే అధికార ప్రతినిధిని పెట్టి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లిని కించపరిచే విధంగా బూతులు తిట్టించారని ధ్వజమెత్తారు. తల్లులను కూడా దూషించే స్థితికి దిగజారిన చంద్రబాబు కొంగ జపాలు చేస్తే జనం అర్థం చేసుకోలేరా అంటూ ప్రశ్నించారు.

లోకేష్ బోసడీకే నాన్నా అని పిలుస్తారా ?

లోకేష్ బోసడీకే నాన్నా అని పిలుస్తారా ?

బోసడికే అన్న పదానికి బాగున్నారా అని అర్థం అని టిడిపి నేతలు చెబుతున్నారు కదా, ఢిల్లీ వెళ్లి చంద్రబాబు రాష్ట్రపతిని, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ని బోసడికే అనే సంబోధిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక లోకేష్ తన తండ్రిని నాన్న బాగున్నారా అనడానికి బదులు బోసడికే నాన్న అని అడుగుతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా కాన్వాయ్ మీద చెప్పులు వేయించిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని అమిత్ షా ని కలుస్తారు అంటూ ధ్వజమెత్తారు.

 ఢిల్లీలో మేము బూతులు తిడితే వైఎస్సార్సీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా?

ఢిల్లీలో మేము బూతులు తిడితే వైఎస్సార్సీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా?

సి.బి.ఐతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు టిడిపి ప్రభుత్వ హయాంలో సీబీఐను రాష్ట్రంలోకి రానివ్వమని రచ్చ చేసిన విషయం గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. లోకేష్ స్పీచ్ బ్రహ్మానందం కామెడీ లా ఉందని, మంగళగిరిని గిఫ్ట్ గా ఇస్తానని మాట్లాడటం విని జనాలు నవ్విపోతున్నారన్నారు. ప్రభుత్వం మీద ఉగ్రవాదం చేస్తుంది తెలుగుదేశం పార్టీ లేదని మండిపడ్డారు. అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చెప్తారు అని ప్రశ్నించిన కన్నబాబు, మేము బూతులు తిడితే వైఎస్సార్సీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా అంటూ ప్రశ్నించారు.

English summary
Minister Kannababu fires on the conspiracies of chandrababu. Chandrababu was incensed that he is going to delhi, minister kannababu said amit shah know tha chandrababu very well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X