ఏపీలో విద్యార్ధులకు మంత్రి లోకేష్ తీపికబురు.. !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు వ్యూహాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నింటిలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్ సదుపాయాలు.. తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను పునః వ్యవస్థీకరించి నిపుణుల సలహాలతో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అందుకు సంబంధించిన బోర్డు మీటింగ్ త్వరలో నిర్వహించనున్నట్టు తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM)పై ఆసక్తి పెంచేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో విద్యార్థులలో క్రియాశీలత, ఆవిష్కరణ సామర్థ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టితో సెప్టెంబర్ 1 నుంచి ఓ నైపుణ్య పోర్టల్‌ను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పోర్టల్ ద్వారా శిక్షణలు, ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు వంటి సమాచారం ఒకే చోట లభించనుందన్నారు.
ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో సమీక్షించాను. స్కూల్ ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్(FLN) కార్యక్రమ… pic.twitter.com/KRa9kLforj
— Lokesh Nara (@naralokesh) July 15, 2025
మరోవైపు ప్రతి జిల్లాలో ఉపాధి కల్పన అధికారుల స్థానంలో ఇప్పుడు నైపుణ్య అభివృద్ధి అధికారులను నియమించనున్నట్టు స్పష్టం చేశారు. వారి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని మంత్రి తెలిపారు.
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్తున్న వారికి అవసరమైన సమాచారం, హెల్ప్‌లైన్‌లు, సలహాలు అందించేందుకు మార్గదర్శకాలు రూపొందించనున్నారు. యువతకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హెల్ప్‌లైన్ నంబర్: 0863-2340678, వాట్సప్ నంబర్: 85000 27678. లను సంప్రదించాలని కోరింది.
ఇప్పటికే తల్లికి వందనం పథకంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది. కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించబడింది. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. వారందరికీ ఈ రూ.15000 ఇచ్చింది.












Click it and Unblock the Notifications