జగన్ చేసిన తప్పులు మనం చెయ్యకూడదు, మంత్రి ఆర్డర్
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రిజర్వాయర్లు, తాగునీటి ప్రాజెక్టులలో అత్యవసర పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు నీటి పారుదల ప్రాజెక్టుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో పలు సూచనలు చేశారు.
రిజర్వాయర్లు, తాగునీటి ప్రాజెక్టుల పనులను వెంటనే నిర్వహించాలని మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ రూ. 284 కోట్లు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాగునీటి ప్రాజెక్టుల గేట్లు, రోప్స్, షట్టర్లు వంటి వాటికి ఎలాంటి మరమ్మతులు చేయకుండా జగన్ నిర్లక్ష్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

ఐదు సంవత్సరాల పాటు వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు తాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అత్యవసర పనులు చెయ్యాల్సి వచ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా 2,323 పనులను వెంటనే చేపట్టాలని, ఈ పనులకు టెండర్లు పిలవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్షం చెయ్యకూడదని మంత్రి నిమ్మల చెప్పారు.
గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో తాగునీటి ప్రాజెక్టుల రిజర్వాయర్ల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రిజర్వాయర్లు, డ్రైనేజీలు, కాలువల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అవుట్సోర్సింగ్ మేనేజ్ మెంట్ పద్ధతిలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని, ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ చేసిన తప్పులు మనం చెయ్యకూడదని, జాగ్రత్తగా పనులు పూర్తి చెయ్యాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications