ఫలితాలపై మంత్రి రోజా రియాక్షన్

ఏపీలో ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి నేతలు స్పష్టమైన అధిక్యంలో నిలిచారు. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి అంచునా నిలిచారు. ఏపీ మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు. వైసీపీ ఓటమి దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలను చూస్తే ఇది అర్థమవుతుంది. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దీంతో ఏ స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది అనేది రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలు నిరూపిస్తున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంత్రులు ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో నటి రోజా కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు.

minister roja reaction after polling results

అయితే, ఏపీలో కూటమి హవా కొనసాగుతున్న వేళ మంత్రి రోజా తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. నటి రోజా తన ట్విటర్ ఖాతాలో భాగంగా చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేశారు. భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు. అని రోజా ట్వీట్ లో పేర్కొన్నారు. రోజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+